రచయిత: ప్రభువైన యేసు క్రీస్తు రాయబారి అయిన పౌలు
వ్రాసిన కాలం:
క్రీస్తు శకం 56 ప్రాంతంలో.
ముఖ్యాంశం:
క్రీస్తు రాయబారి పౌలు స్థాపించిన కొరింతు సంఘంలో విపరీతమైన సిద్ధాంతాలూ, అలవాట్లూ, నానా విధాల పాపాలు ప్రవేశించాయి. విభేదాలూ చీలికలు ఏర్పడ్డాయి. ఆ లోపాలను సవరించే ఉద్దేశంతో పౌలు ఈ లేఖ రాశాడు. అక్కడి క్రైస్తవుల అయోగ్యమైన ప్రవర్తన గురించి తన దుఃఖాన్ని తెలియజేస్తూ వారిని మందలించాడు. వారెలా పవిత్రంగా జీవించాలో వారికి జ్ఞాపకం చేశాడు. ఈ లేఖలో దేవుని ప్రేమను వివరిస్తూ అన్నిటినీ మించిన దివ్యమార్గం వెల్లడి చేశాడు (13వ అధ్యాయం).
విషయసూచిక:
పౌలు కృతజ్ఞతలు, ఆ సంఘం గురించి అతని నమ్మకం 1:4-9
తగాదాలున్న కొరింతు సంఘం 1:10-17
నిజమైన జ్ఞానం, శక్తి 1:18-31
కొరింతులో పౌలు బోధించే విధానం 2:1-5
దేవుని ఆత్మ దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు 2:6-16
కొరింతులో శరీర స్వభావాన్ని అనుభవించే క్రైస్తవులు 3:1-4
దేవుని సేవకులు 3:5-9
ప్రతి క్రైస్తవుని పని పరీక్షకు గురవుతుంది 3:10-15
మూర్ఖత్వం, జ్ఞానం 3:16-20
క్రీస్తులో విశ్వాసి సంపద 3:21-23
క్రీస్తు సేవకులు 4:1-21
లైంగిక అవినీతి, క్రైస్తవులు దీని గురించి ఏం చేయాలి? 5:1-13
క్రైస్తవులలో వ్యాజ్యాలు 6:1-11
శరీరం లైంగిక అవినీతి కోసం కాదు, దేవుని ఆత్మకోసం 6:12-20
విశ్వాసుల మధ్య వివాహం 7:1-40
క్రీస్తులో ప్రేమ, స్వేచ్ఛ 8:1-13
సేవలో పౌలు మాదిరి 9:1-18
పౌలు తన స్వేచ్ఛను ఉపయోగించడం 9:19-23
విశ్వాసులు కిరీటం సంపాదించాలంటే అనుసరించవలసిన విధానం 9:24-27
ఇస్రాయేల్ చరిత్రనుంచి పాఠాలు 10:1-11
విషమ పరీక్షలు 10:12-13
ప్రభువు బల్ల, పిశాచాల బల్ల 10:14-22
స్వేచ్ఛ, విశ్వాసులు అనుసరించడానికి నియమాలు 10:23-33
బహిరంగ ఆరాధన 11:3-16
ప్రభురాత్రి భోజనం 11:17-34
ఆధ్యాత్మిక కృపావరాలు, సామర్థ్యాలు 12:1-11
ఒక్కటే క్రీస్తు శరీరం, అనేక ఆధ్యాత్మిక సామర్థ్యాలు 12:12-31
ప్రేమ అన్నింటికంటే గొప్పది 13:1-13
దేవునిమూలంగా పలికే వరం, తెలియని భాషలో మాట్లాడే వరం 14:1-40
పౌలు ప్రకటించిన శుభవార్త 15:1-11
క్రీస్తు విశ్వాసుల పునర్జీవితం 15:12-34
క్రొత్త రకం శరీరం 15:35-50
చివరి బూర 15:51-58
విశ్వాసులకోసం సేకరించిన డబ్బు 16:1-4
పౌలు విన్నపాలు 16:5-18
ముగింపు మాటలు 16:9-24
No comments:
Post a Comment