Breaking

Saturday, 26 February 2022

పరిశుద్ధంగా జీవించడానికి మూడు మార్గాలు

 



మనలో ప్రతీ ఒక్కరికి పరిశుద్ధంగా జీవించాలనే ఆశ ఉంటుంది కానీ చాలా సార్లు పరిశుద్ధంగా జీవించడం 

ఎలాగో అర్థం కాదు. చెడు చేయకూడదు అనుకున్న దాన్నే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాము మంచి చేయాలి అనుకున్న చేయలేకపోతుంటాము  

చెడు చేసామన్న అపరాధ భావం చేయవలసింది చేయలేకపోతున్నామనే బాధ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే ఈ వీడియోలో పరిశుద్ధంగా ఎలా జీవించాలో 

పరిశుద్ధంగా జీవించడానికి ఉన్న మూడు ముఖ్యమైన మార్గాలేంటో చెప్పబోతున్నాను 

ఈ మూడు విషయాలు మనము పాటించినట్లైతే 

ప్రతీ పాపము పై జయము సాధించి పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకములో జీవించగలం  

అయితే మొదటగా పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి 

పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు 

22.కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకొని 

23.మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, 

24.నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అని 

ప్రియులారా 

ఇక్కడ నీతి పరిశుద్ధత అనేవి రెండు వేరు వేరు విషయాలుగా మనకు కనిపిస్తున్నాయి 

నీతి అనేది మనము ఎప్పుడైతే క్రీస్తులో నూతనంగా జన్మిస్తామో అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడుతాము. అలాగే మన పాపములను ఒప్పుకొని  పశ్చాత్తాప పడినపుడు దేవుడు మనల్ని  పరిశుద్ధపరుస్తాడు. అయితే నీతి పరిశుద్ధత అనే వాటిని మనము ప్రతీ దినం కాపాడుకొనవలసిన వారమై యున్నాము 


క్రీస్తులో మనము ఏమై ఉన్నామో అన్న దాన్ని బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది 

మనము క్రీస్తులో నూతన సృష్టి కాబట్టి మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి 

వేషధారులు లోపల ఒకటి ఉంచుకుని బయటికి వేరే విధంగా కనిపిస్తారు.

కానీ మనము లోపల ఏమై ఉన్నామో దాన్నే మనము 

జీవించే పద్ధతుల ద్వారా కనపర్చాలి 

ఈ విధానం మన ప్రవర్తనలో  ఎంత పెద్ద మార్పునైనా తీసుకుస్తుంది.


అండ్రు వొమక్ అనే భక్తుడు ఈ విధంగా అన్నాడు 

పరిశుద్ధత అనేది మూలం కాదు పరిశుద్ధత అనేది ఫలము అని క్రైస్తవులైన ప్రతీ ఒక్కరు ఈ ఫలాన్ని  ఫలించాలి కానీ చాలా మందికి ఎలా పరిశుద్ధంగా 

జీవించాలో అర్థం కాకా పాపముతో పెనుగులగె పరిస్థితులలో ఉన్నారు 

అందుకే ఈ వీడియోలో పరిశుద్ధంగా జీవించడానికి ఉన్న మూడు ముఖ్యమైన మార్గాలేంటో చెప్పబోతున్నాను 


అందులో మొదటిది పాపాన్ని లక్ష్యపెట్టకుండుట 

చాలా సార్లు మనము క్రియ పూర్వకంగా ఏదైనా చేస్తేనే పాపం అనుకుంటాము. కానీ దాన్ని మనము లక్ష్యపెట్టిన దాని పట్ల ఇష్టాన్ని కలిగి ఉన్న అది దేవునికి పాపమే మన ప్రార్ధనలకు ఆటంకమే అందుకే దావీదు భక్తుడు ఈ విధంగా అన్నాడు 

నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని 

ప్రియులారా 

మనము పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ పడినట్లైతే 

పాపము చేయకూడదు అనే నిర్ణయాన్ని తీసుకుంటాము కానీ దానికి ముందు పాపాన్ని లక్ష్య పెట్టకూడదు అనే నిర్ణయాన్ని మనము తీసుకోవాలి 


యేసయ్య  ఈ విధంగా అంటున్నాడు 

ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.

నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా.

నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా.అని 

ప్రియులారా ఇక్కడ “హృదయంలో”– అంటే మోహపు తలంపులు ఉన్నవారు ఇక వ్యభిచారం చేసినా నష్టమేమీ లేదని ప్రభువు ఉద్దేశం కాదు. లోపలి ఆలోచనలకూ, బయటి ప్రవర్తనకూ తేడా ఏమీ లేదని ఆయన చెప్పడం లేదు. మన మనసులోని ఆలోచనల కంటే మన చర్యలే ఇతరులకూ, మనకూ కూడా చాలా ఎక్కువ హాని కలిగిస్తాయి. సాటి మనిషిని ద్వేషించడం దానంతట అది చెడు విషయమే గానీ అతణ్ణి హత్య చెయ్యడం అనేది మెట్టు ముందుకు వెళ్ళి అతడి ప్రాణాన్ని దోచుకుంటుంది. అలాగే మోహపు చూపు చెడు విషయమే గానీ వ్యభిచారమైతే ఒక మనిషిని కలుషితం చేసి మరొకరిని కూడా పాపంలోకి ఈడ్చి, తద్వారా కలిగే చెడు ఫలితాలన్నిటినీ వెంటబెట్టుకు వస్తుంది. ఒకడికి మోహపు చూపు ఉంటే ఇక వెళ్ళి వ్యభిచారం చేసినా, ఆ మోహపు చూపు కంటే ఎక్కువ పాపం కాదులే అనడం సైతాను కల్పించిన అబద్ధం. హృదయాన్నీ, బయటి చర్యనూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని యేసయ్య ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. పవిత్రతను సంపాదించుకోవడానికి శరీర భాగాలను నరుక్కోవడం తోడ్పడుతుందని యేసుప్రభువు ఉద్దేశం కాదు. మన పాపానికి కారణమయ్యేవి, పాపం చేయించేవి మన కళ్ళు, చేతుల వంటి అవయవాలు కాదని మనకూ ఆయనకూ కూడా తెలుసు. కళ్ళు పీక్కోవడం, చేతులు నరుక్కోవడం ద్వారా మనం మంచివాళ్ళం అయిపోము, ఆ పద్ధతుల ద్వారా పాపాలు చేసే అవకాశాలు లేకుండా పోవని కూడా ఆయనకు తెలుసు. కుడి కన్ను పెరికివేస్తే ఎడమ కన్ను ఉంటుంది. రెండూ పెరికివేస్తే మనసులో, భ్రష్ట హృదయంలో ఆలోచనలూ ఊహలూ ఉంటాయి పాపం అనేది హృదయంలో గూడు కట్టుకుని ఉంది. దాన్ని జయించాలంటే సంపూర్ణ పశ్చాత్తాపం, పాత జీవితంతో పూర్తి తెగతెంపులు అవసరమని యేసయ్య  ఉద్దేశం. ఒక అత్యంత ప్రాముఖ్య సత్యాన్ని నొక్కి చెప్పేందుకు యేసయ్య ఇలా కొట్టొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. అదేమంటే నరకం బారిన పడకుండా ఉండేందుకు ఒక మనిషి ఏం చేసేందుకైనా తెగించి ఉండాలి. ప్రతి పాపం నుంచీ, చెడు ప్రేరేపణ నుంచీ, దేవుని రాజ్యంలోకి ప్రవేశించనియ్యకుండా అడ్డుపడే ప్రతిదాని నుంచీ తనను తాను ఛేదించుకుని వేరుపడాలి. ఇలా చెయ్యని వ్యక్తి దేవుని రాజ్యానికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వడం లేదన్నమాట. దేవుని కోపానికి భయపడవలసినంతగా భయపడడం లేదన్నమాట. మోహం, అపరాధ చర్యలు శరీర అవయవాల్లాంటివి వాటిని మనము మరణానికి అప్పగించాలి 


రెండవదిగా మనము పరిశుద్ధంగా జీవించాలంటే 

పాపము నుండి పారిపోవాలి 

యోసేపు సరిగ్గా ఇలాగే చేశాడు పోతీఫర్ భార్య తనను శోధించినప్పుడు పాపము చేయమని తనను ప్రేరేపించినప్పుడు అక్కడ నుండి పారిపోయాడు 

మనమున్న చోటే ఉండి మన పరిస్థితి మారాలంటే 

కొన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు పాపము నుండి దూరంగా పారిపోవడం మనము నేర్చుకొనవలసిన వారమై యున్నాము 


అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు 

నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.అని 

ప్రియులారా పౌలు యవ్వనులకు కలిగే చెడు కోరికల నుండి దూరంగా పారిపోవాలని శుద్ధ హృదయముతో 

ప్రభువునకు ప్రార్ధన చేసే వారితో కూడా నీతి న్యాయాలను నమ్మకాన్ని ప్రేమను శాంతిని ఆసక్తితో అనుసరించాలని అటువంటి లక్షణాలు కలిగిన వారే 

ప్రభువుకు కావాల్సి ఉన్నదని తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు 

పాపం చూస్తున్నప్పుడు అందముగా ఉంటుంది చేస్తున్నప్పుడు ఆనందాన్నిస్తుంది కానీ చివరికి అది మిగిల్చేది మాత్రం ఆవేదనే 

మనము పాపము నుండి పారిపోతున్నామా పాపము వైపు పరిగెడుతున్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకినవలసిన వారమై యున్నాము 

పాపము నుండి పారిపోయిన యోసేపును దేవుడు ఆశీర్వదించాడు ఒక ఇంటి విచారణ కర్తగా ఉన్న స్థాయి నుండి ఒక దేశ అధికారిగా మార్చివేశాడు 

గనుక మనమును పాపము నుండి పారిపోతు దేవుని ఆశీర్వాదాలకు దగ్గరవుదాం 


మూడవదిగా పరిశుద్ధముగా జీవించడానికి మనకున్న గొప్ప మార్గం ఏంటంటే 


జీవించాలంటే 


దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి 


కొలస్సీయులకు 3: 15, 16

క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి.

సంగీత ములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.అని 

ప్రియులారా 

ప్రతీ క్షణం మన హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి 

మన తలంపుల్లో, ఆశల్లో, ఆశయాల్లో, కోరికల్లో, ధ్యానంలో వాక్యానికి కేంద్ర స్థానం ఉండాలి.

మనము దేవుని వాక్యాన్ని నేర్చుకొంటూ, ధ్యానిస్తూ, విధేయత చూపిస్తూ, ఉపదేశిస్తూ, అస్తమానం గుర్తు చేసుకుంటూ ఉండడం ఎంతో ప్రాముక్యమై యున్నది 

కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు 

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.అని 

ప్రియులారా 

ఈ వచనంలో నిజమైన ధన్యతకూ దేవుడు వెల్లడించిన సత్యాన్ని ప్రేమించడానికీ మధ్య ఉన్న సంబంధం అర్థమౌతున్నది. ధన్యజీవి చెడు మాటలకూ చెడు విధానాలకూ దూరంగా ఉండడమే కాదు, పూర్తిగా వేరొక దానిలో నిమగ్నమై ఉంటాడు అని “ఆనందిస్తూ”, “ధ్యానం చేస్తూ” అనే రెండు ముఖ్యమైన పదాలు సూచిస్తున్నాయి. దేవుని ఉపదేశంలో ఆనందించడమంటే దేవునిలోను, దేవుని మార్గాల్లోను వెల్లడైన ఆయన సంకల్పంలోనూ ఆనందించడమే. హృదయానికి మరేదీ ఇవ్వలేనంత ఆనందాన్ని ఇది ఇస్తుంది. 

గనుక ప్రతీ దినం మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువులో ఆనందిస్తూ పరిశుద్దమైన జీవితాన్ని జీవిద్దాం 

అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక 




No comments:

Post a Comment