రచయిత:
మార్కు బర్నబాకు దగ్గర బంధువు. ఇతడి మరో పేరు యోహాను. ఇతడు బర్నబాతోనూ, పౌలుతోనూ, సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా పేతురుతో కలసి క్రీస్తు సేవ చేశాడు. 1 పేతురు 5:13తో పోల్చి చూడండి. ఈ శుభవార్తలో రాసిన విషయాలు చాలా వరకు అతడు పేతురు దగ్గర నేర్చుకుని ఉండివుండవచ్చు.
వ్రాసిన కాలం:
క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన కొన్ని సంవత్సరాలకు కొందరు విద్వాంసులు క్రొత్త ఒడంబడికలో మొట్టమొదట రాసిన శుభవార్త ఇదేనని నమ్ముతారు గానీ దానికి రుజువు లేవు.
ముఖ్యాంశం:
మార్కు క్రీస్తును గొప్ప పనులు చేసే దేవుని కుమారుడిగానూ (1:1) దేవుని సేవకుడిగానూ బయల్పరుస్తున్నాడు. అపొ కా 10:38; రోమ్ 15:8-9తో పోల్చి చూడండి. క్రీస్తు ఉపదేశాలకంటే ఆయన చేసిన పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు మార్కు. క్రీస్తు చేసిన 18 అద్భుతాలు రాస్తూ కేవలం 4 ఉదాహరణలు మాత్రమే రాశాడు (మత్తయి 14, లూకా 15 ఉదాహరణలు రాశారు).
విషయసూచిక
దేవుని సేవకుని సిద్ధపాటు 1:1-13
ఆయన ఇతరులను దేవుని సేవకు పిలిచాడు 1:14-20
ఆయన కపెర్నహూంలో వివిధ అద్భుతాలు చేశాడు 1:21-34
ఆయన చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉపదేశిస్తూ రోగులను బాగు చేశాడు 1:35-45
ఆయన ఒక పక్షవాత రోగిని బాగు చేసి క్షమించాడు 2:1-12
ఆయన మత్తయిని పిలిచి అతని ఇంట్లో భోజనం చేశాడు 2:13-17
ఆయన కొన్ని అభ్యంతరాలకు సమాధానం చెప్పాడు 2:18-28
ఆయన చేయి ఎండిపోయిన ఒకడిని బాగు చేసి అధికారుల ద్వేషానికి గురయ్యాడు 3:1-6
ఆయన ఇంకా చాలామందిని బాగు చేశాడు 3:7-12
ఆయన తన శిష్యులను ఎన్నుకొన్నాడు 3:13-19
ఆయన ప్రజల అపార్థానికి, దూషణకు గురయ్యాడు 3:20-30
పవిత్రాత్మకు వ్యతిరేకంగా పాపం 3:29-30
ఆయన తన తల్లి, చెల్లెళ్ళ, తమ్ముళ్ళ గురించి మాట్లాడాడు 3:31-35
ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ఇచ్చిన కొన్ని ఉదాహరణలు 4:1-34
ఆయన తుఫాను ఆపు చేశాడు 4:35-41
ఆయన పిశాచాల సేన పట్టిన మనిషిని బాగు చేశాడు 5:1-20
ఆయన చనిపోయిన యాయీరు కుమార్తెను సజీవంగా లేపి,
రుతుస్రావంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేశాడు 5:21-43
ఆయన నజరేతులో తిరస్కారాన్ని, అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు 6:1-6
ఆయన తన శిష్యులను బయటకు పంపిన సంగతి 6:7-13
బాప్తిసమిచ్చే యోహాను మరణం 6:14-29
ఆయన ఐదు వేలమందికి ఆహారం ఇచ్చాడు 6:30-44
ఆయన నీటిమీద నడచిన విషయం 6:45-52
ఆయన చాలామందిని బాగు చేశాడు 6:53-56
ఆయన యూదుల అధికారులతో వాదించాడు 7:1-16
ఆయన శుద్ధమైన, అశుద్ధమైన వాటిని గురించి బోధించాడు 7:17-23
ఆయన ఫెనికయకు చెందిన ఒకామె కుమార్తెను బాగు చేశాడు 7:24-30
ఆయన నత్తి చెవుడు ఉన్న మనిషిని బాగు చేశాడు 7:31-37
ఆయన నాలుగు వేల మందికి ఆహారం పెట్టాడు 8:1-10
ఆయన యూదుల అధికారుల ఉపదేశాల గురించి శిష్యులను హెచ్చరించాడు 8:11-21
ఆయన గుడ్డివాణ్ణి బాగు చేశాడు 8:22-26
ఆయన ఎవరో బయలుపరుస్తూ ఆయన చావును గురించి,
తిరిగి సజీవంగా లేవడం గురించి చెప్పాడు 8:27-33
ఆయన శిష్యత్వానికి కావలసిన అర్హతలను ఇచ్చాడు 8:34-37
ఆయన దివ్యరూపం 9:1-8
ఆయన ఏలీయా గురించి, బాప్తిసమిచ్చే యోహాను గురించి మాట్లాడాడు 9:9-13
ఆయన దయ్యం పట్టిన అబ్బాయిని బాగు చేశాడు 9:14-29
ఆయన నిజమైన గొప్పతనం ఏమిటో ఉపదేశించాడు 9:30-37
ఆయన నరకాన్ని గురించి హెచ్చరించాడు 9:42-50
ఆయన వివాహం, విడాకుల గురించి ఉపదేశించాడు 10:1-12
ఆయన చిన్నపిల్లలను ఆశీర్వదించాడు 10:13-16
ఆయన ఆస్తిపరుడైన యువకుడితో మాట్లాడాడు 10:17-22
ఆయన నమ్మకమైన శిష్యులకు చేసిన వాగ్దానం 10:23-31
ఆయన తన మరణం, తిరిగి జీవించడం గురించి ఉపదేశించాడు 10:32-34
ఆయన మళ్ళీ గొప్పతనాన్ని గురించి చెప్పాడు 10:35-45
ఆయన యెరికోలో గ్రుడ్డివాడిని బాగు చేశాడు 10:46-52
ఆయన జెరుసలంలోకి గాడిదమీద వెళ్ళాడు 11:1-10
ఆయన అంజూర చెట్టును శపించాడు 11:11-14
ఆయన వర్తకులను దేవాలయంలో నుంచి వెళ్లగొట్టాడు 11:15-17
ఆయన నమ్మకానికి ఉన్న శక్తి గురించి మాట్లాడాడు 11:22-26
ఆయన మతాధికారులను ఎదిరించాడు 11:27-33
ఆయన ద్రాక్షతోటను గురించి ఇచ్చిన ఉదాహరణ 12:1-12
ఆయన మతాధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు 12:13-40
ఆయన కానుకల గురించి మాట్లాడాడు 12:41-44
ఆయన భవిష్యత్తు గురించి తన రెండవ రాక గురించి చెప్పాడు 13:1-37
ఆయనను ఒక స్త్రీ అభిషేకించినది 14:1-9
ఆయనపట్ల యూదా ఇస్కరియోతు ద్రోహం చేశాడు 14:10-11
ఆయన తన శిష్యులతో గడిపిన చివరి పస్కా పండుగ,
వారికి క్రొత్త ఒడంబడికను ఇచ్చాడు 14:12-31
ఆయన గెత్‌సేమనేలో ప్రార్థించాడు 14:32-42
ఆయన బందీ అయ్యాడు 14:43-52
ఆయన ప్రముఖయాజి ముందు నిలబడ్డాడు 14:53-65
ఆయనను పేతురు ఎరగనని చెప్పాడు 14:66-72
ఆయన పిలాతు ముందు నిలుచున్నాడు 15:1-15
ఆయన రోమ్ సైనికులచేత అవమానం పొందాడు 15:16-20
ఆయనను సిలువ వేశారు 15:21-41
ఆయనను పాతిపెట్టారు 15:42-47
ఆయన చనిపోయినవారిలోనుండి లేచాడు 16:1-8
ఆయన తన విశ్వాసులకు ప్రత్యక్షం కావడం, వారికి ఆదేశాలు ఇచ్చాడు 16:9-18
ఆయన పరలోకంలోకి ఎక్కివెళ్ళాడు 16:19
No comments:
Post a Comment