Breaking

Thursday, 3 February 2022

జెఫన్యా (పరిచయం)

 


రచయిత:

హిజ్కియారాజు సంతతివాడైన జెఫన్యా ప్రవక్త.

వ్రాసినకాలం:

ఇతడు యోషియారాజు పరిపాలన కాలంలో (క్రీ. పూ. 640-609) భవిష్యద్వాక్కులు పలికాడు. బహుశా యిర్మీయా, నహూము, హబక్కూకుల సమకాలీకుడై ఉండవచ్చు. జెఫన్యా పరిచర్య తరువాతి రోజుల్లో యోషీయారాజు తన సంస్కరణలు చేపట్టి ఉంటాడు.

ముఖ్యాంశాలు:

యెహోవా దినం గురించిన వివరాలు. ఇస్రాయేల్‌వారు తమ అసహ్య ప్రవర్తనను గుర్తించి పశ్చాత్తాపపడాలని, లేకుంటే శిక్ష తప్పదని ప్రవక్త హెచ్చరించాడు. చివరి రోజుల్లో వారిపై దేవుడు కురిపించబోయే ఆశీస్సులను కూడా వర్ణించాడు.

విషయసూచిక:

ప్రవక్త పరిచయం 1:1

యూదాపైనా, లోకమంతటిపైనా విరుచుకుపడబోయే దేవుని తీర్పు 1:2-6

యెహోవా దినాన జరిగే నాశనకాండ 1:7-18

శిక్ష రాకముందే దేవునివైపుకు తిరగాలని పిలుపు 2:1-3

ఇరుగుపొరుగు జాతులపైకి రానున్న శిక్ష 2:4-15

ఫిలిష్తీయవారికి శిక్ష 2:4-7

మోయాబు, అమ్మోనువారికి శిక్ష 2:8-11

కూషువారికి శిక్ష 2:12

అష్షూరువారికి శిక్ష 2:13-15

జెరుసలంలో జరుగుతున్న అక్రమాలకు శిక్ష 3:1-5

ఇతర జనాలపై రానున్న దేవుని శిక్ష 3:6-9

చెదిరిపోయిన యూదులు తిరిగి వచ్చాక వారి క్షేమస్థితి 3:10-13

యూదులకు కలగబోయే దీవెనలు 3:14-20

No comments:

Post a Comment