రచయిత:
హబక్కూకు ప్రవక్త.
వ్రాసిన కాలం:
బహుశా యెహోయాకీము పరిపాలనా కాలంలో బబులోనువారు యూదాపై దాడి చేయడానికి కొద్దికాలానికి హబక్కూకు రాశాడు (2 రాజులు 24:1-2).
ముఖ్యాంశాలు:
సందేహాన్ని జయించే విశ్వాసం. దేవుని ప్రజలైన యూదావారిని శిక్షించడానికి దేవుడు పాపిష్టి క్రూర జనమైన బబులోనువారిని ఉపయోగించడం ఎందుకన్నది ప్రవక్తను కలచివేసిన ప్రశ్న. దీనికి దేవుడు జవాబిచ్చాడు. “న్యాయవంతుడు దేవుని మీది నమ్మకంవల్లే జీవిస్తాడు”. 3వ అధ్యాయంలోని ప్రార్థన గీతం కీర్తనల గ్రంథ శైలిని పోలి ఉంది.
విషయసూచిక:
తన కాలంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని చూచి ప్రవక్త ఆందోళన 1:1-4
దానికి దేవుని జవాబు. తన ప్రజను శిక్షించేందుకు
ఆయన బబులోనువారిని రప్పిస్తున్నాడు 1:5-11
దుష్టులైన బబులోనువారిని దేవుడు వాడుకోవడమెందుకని ప్రవక్త ప్రశ్న 1:12-17
దేవుని సంకల్పం త్వరలో నెరవేరనున్నది 2:1-4
దుర్మార్గులకు శిక్ష 2:5-11
రక్తపాతం జరిగించేవాడికి శిక్ష 2:12-14
వంచన, దౌర్జన్యం చేసేవాడికి శిక్ష 2:15-17
విగ్రహపూజకుడికి శిక్ష 2:18-20
దేవుని గురించి స్తుతి కీర్తన 3:1-19
దేవుని కనికరం, మహిమా తేజస్సు 3:1-6
జనాలపై ఆయన తీవ్రకోపాగ్ని 3:7-15
దేవునిలో ప్రవక్తకున్న నమ్మకం, ఆనందం 3:16-19
No comments:
Post a Comment