Breaking

Thursday, 6 January 2022

ఘనమైనవి నీ కార్యములు - Ganamainavi ni karamulu song lyrics

 



Ganamainavi ni karamulu song lyrics 


ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే (2)        ||ఘనమైనవి||


1.యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము          ||ఘనమైనవి||

2.నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము          ||ఘనమైనవి||

3.నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2)
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము          ||ఘనమైనవి||


No comments:

Post a Comment