రచయిత:
ఎవరు రాశారన్నది ఈ పుస్తకంలో లేకపోయినా సొలొమోను ఈ పుస్తకాన్ని రాశాడనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి – 1:1, 12, 16; 2:4-9; 12:9.
వ్రాసిన కాలం:
క్రీ.పూ. 970-930 మధ్య సొలొమోను రాజ్యపాలన చేశాడు. బహుశా అతని జీవితం చివరి దశలో ఈ పుస్తకాన్ని రాసి ఉండవచ్చు.
ముఖ్యాంశం:
మనుషులకు తెలిసినదంతా చాలా తక్కువ అని దేవుడు చూపించాలనుకున్నాడు. దేవునికి దూరమైనప్పుడు మానవుని జీవితం, అతని పనులు ఎంత వ్యర్థంగాను, అర్థరహితంగాను ఉంటాయో ఆయన తెలియజేయదలచాడు. ఈ సత్యాన్ని రాతపూర్వకంగా తన వాక్కైన బైబిలులో ఉంచాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ సత్యాన్ని బయలు పరచడానికి ఆయన ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. ఈ లోకంలో అందరికంటే మించిన జ్ఞానం గల వ్యక్తిగా అతన్ని ఆయన చేశాడు. అతని జ్ఞానం సొక్రటీసు లేక బుద్ధుడు లేక కన్ఫ్యూషియస్ లేక ఏ ఇతర ప్రసిద్ధుడైన వ్యక్తికన్నా మించినది (అయినా గాని ఈ విషయంలో యేసు క్రీస్తును మినహాయించాలి. ఎందుకంటే ఆయనే దేవుని జ్ఞానమై ఉన్నాడు – 1 కొరింతు 1:24, 30). ఈ లోకంలో ఉన్నవారందరికంటే మించిన ఆస్తిపరునిగా దేవుడు అతన్ని చేశాడు. మనుషులు అనుభవించే సమస్తాన్ని అనుభవించడానికి అతనికి అన్ని రకాల అనుకూలతలు, సామర్థ్యం, అవకాశాలను దేవుడు కల్పించాడు. దేవుడతనికి అన్నిటిని పరిశోధించగల మనస్సును జీవితంయొక్క అర్థాన్ని కనుగొనాలన్న బలమైన ఆశను అతనిలో ఉంచాడు. తార్కిక దృష్టితో సంగతులను, సాక్ష్యాధారాలను వడగట్టి చూడగల మనస్సును దేవుడతనికి అనుగ్రహించాడు. దేవుడు నియమించుకొన్న ఆ వ్యక్తే సొలొమోను. ఈ దైవకార్య ఫలితాల్లో ఒకటి ఈ ప్రసంగి పుస్తకం.
విషయసూచిక
పుస్తకం సారాంశాన్ని సొలొమోను తెలియజేయడం 1:1-2
అతడిచ్చిన కొన్ని సాదృశ్యాలు 1:3-11
తన గురించి మరెక్కువ పరిచయం 1:12-16
జీవితంయొక్క అర్థం తెలుసుకోవడానికి అతని తీర్మానం 1:17—2:16
జ్ఞానం, పతనం గురించి అతని ప్రయత్నం 1:17; 2:3
సుఖభోగాల ప్రయత్నం 2:1-2
మధ్యపాన ప్రయత్నం 2:3
కొన్ని ఘనకార్యాలను అతడు చేపట్టడం 2:4-6
సిరిసంపదలను, ఐశ్వర్యాన్ని కూడగట్టడం 2:7-8
వాద్య సంగీత, లైంగిక సుఖభోగ ప్రయత్నం 2:8-9
మనసు కోరిన ప్రతిదాన్ని ప్రయత్నించడం 2:10
కొన్ని విషయాల గ్రాహ్య సారాంశం 2:11
జ్ఞానం, పతనం గురించి మరో ప్రయత్నం 2:12-14
వీటి గురించి అతడు గ్రహించిన సారాంశం 2:15-16
నిరాశ 2:17-23
ఈ జ్ఞాని దానినంతటి గురించి ఆలోచించగలిగిన విషయం 2:24-26
ప్రతిదానికొక సమయం 3:1-8
కాలాన్ని అనంత యుగాలతో పోల్చడం 3:9-14
దేవుని తీర్పును గురించి కొన్ని తలంపులు 3:15-17
జంతువుల, మనుషుల గురించి కొన్ని సంగతులు 3:18-22
ఉనికి కంటే ఉనికి ఉండకపోవడమే మేలనుకోవడం 4:1-8
స్నేహం యొక్క విలువ 4:9-12
వర్థిల్లడం వ్యర్థం 4:13-16
దేవుని పట్ల భయభక్తులు 5:1-7
సిరిసంపదలు వ్యర్థం 5:8—6:12
జీవితంలోని వివిధ పరిస్థితులను గురించి కొన్ని అభిప్రాయాలు 7:1—11:8
జ్ఞానార్జనకు అతని ప్రయత్నం 7:23-25
భవిష్యత్తును గురించి తెలుసుకోలేకపోవడం 8:7-8
కొన్ని సార్లు న్యాయానికి కూడా అపజయం ఎదురౌతుంది 8:14
మానవుడు తన తర్క జ్ఞానంతో జీవితంయొక్క అర్థాన్ని గ్రహించలేడు 8:17
మనుషులందరి చివరి గతి ఒక్కటే అనడం 9:1-12
జ్ఞానానికి ఒక ఉదాహరణ 9:13-18
యువకులకు సలహా 11:9—12:7
విషయానికంతటికీ ముగింపు 12:8-14
No comments:
Post a Comment