Breaking

Wednesday, 19 January 2022

ఆమోసు (పరిచయం)


 


రచయిత:

ఆమోసు ప్రవక్త (ఈ పేరుకు అర్థం “భారం మోసేవాడు”). ఇతడొక పశువులకాపరి. బేత్‌లెహేం ఊరికి దక్షిణంగా 9 కి.మీ. దూరాన ఉన్న తెకోవ గ్రామంలో మేడిపండ్లు సేకరిస్తూ పొట్టపోసుకునే పేదవాడు.

వ్రాసినకాలం:

క్రీ.పూ.760.

ముఖ్యాంశాలు:

దేవుడు తన ప్రజల పట్ల నమ్మకంగా ఉన్నాడు గనుక వారు కూడా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆ ప్రకారం జీవించాలి. సామాజిక న్యాయం అనేది దేవుని పట్ల ఆ సమాజంలోని మనుషులకు ఉన్న నమ్మకత్వానికి ప్రతిబింబం. దేవుడు భూమంతటికీ అధిపతి, దుష్ట జాతులను ఆయన శిక్షిస్తాడు. నమ్మకద్రోహులై, అవిధేయులై, ఒడంబడికను మీరే తన ప్రజలను కూడా శిక్షిస్తాడు. ఇస్రాయేల్ వారి పాపం మూలంగా వారిని పెళ్ళగించి శిక్షించేందుకు దేవుడు వేరొక ప్రజను వాడుకుంటాడు. చివరలో ఇస్రాయేల్ ప్రజల విముక్తిని గురించిన వాగ్దానం ఉంది.

విషయసూచిక:

ప్రవక్త పరిచయం, సమకాలీన స్థితిగతులు, సందేశం 1:2

ఇతర జాతుల పై దేవుని తీర్పులు 1:3—2:3

దమస్కు వారిపై 1:3-5

ఫిలిష్తీయ వారిపై 1:6-8

తూరు నగరవాసులపై 1:9-10

ఎదోంవారిపై 1:11-12

అమ్మోనువారిపై 1:13-15

మోయాబువారిపై 2:1-3

యూదావారిపై తీర్పు 2:4-5

ఇస్రాయేల్ వారిపై తీర్పు 2:6-16

ఆధిక్యతలెక్కువ ఉంటే బాధ్యతలు కూడా ఎక్కువే 3:1-3

ప్రవక్త ద్వారా దేవుడు మట్లాడడం 3:4-8

ఇస్రాయేల్ వారు పేదల్ని బాధించడం, విలాసాల్లో మునిగితేలడం, దానికి శిక్ష 3:9-15

ఇస్రాయేల్ వారు ధనాశ, వారి అసహ్యమైన పూజలు, వారికి రాబోయే శిక్ష 4:1-5

గతంలో వచ్చిన శిక్షల వల్ల ఫలితం లేదు 4:6-13

విలాప వాక్కులు, పశ్చాత్తాపానికి పిలుపు 5:1-6

యెహోవాను వెదకండి – మీరు బ్రతుకుతారు 5:4-6

పేదల్ని బాధించి కూడబెట్టిన ధనం నాశనమౌతుంది 5:7-13

మంచిని ఆశించండి, లేకుంటే వీధుల్లో విలాపం వినబడుతుంది 5:14-17

యెహోవా దినం చీకటి మయం 5:18-20

ఇస్రాయేల్ వారి మత విధానాల ఖండన 5:20-27

ఇస్రాయేల్ వారి గర్వం, అహంభావాల ఖండన 6:1-14

ఇస్రాయేల్ వారిపైకి రానున్న విపత్తుల గురించి దర్శనాలు 7:1-9

మిడతలు 7:1-3

మంట 7:4-6

కొలనూలు 7:7-9

అమజయా యాజికి పట్టనున్న గతి 7:10-17

దర్శనాలు 8:1—9:10

వేసవికాలం పండ్లు ఉన్న గంప 8:1-14

బేతేల్ దగ్గరున్న ఆలయం ధ్వంసం 9:1-10

ఇస్రాయేల్‌కు పూర్వ క్షేమ స్థితి కలుగుతుందన్న వాగ్దానం 9:11-15

No comments:

Post a Comment