రచయిత:
“యిర్మీయా” అంటే “యెహోవా స్థిరపరుస్తాడు” లేక “ఘనపరుస్తాడు” లేక “లేపుతాడు” అని అర్థం. అనాతోతు అనే ఊరిలో యిర్మీయా యాజిగా ఉండేవాడు. అతడు యోషీయా పరిపాలనా కాలంలో (క్రీ.పూ. 626) తన 20వ ఏటనుండి ఆత్మసంబంధమైన సేవను ఆరంభించి ఆ సేవ 40 ఏళ్ళు కొనసాగిస్తూ వచ్చాడు. అతడు కొంత సంపద గలవాడుగా కనబడుతున్నాడు. స్వభావ సిద్ధంగా అతడు మర్యాదస్తుడు, దయ సానుభూతి లక్షణాలు గలవాడు. అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమన్నప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేశాడు. ఇలా చేసినందుకు అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు. మనుషులకు నచ్చని ప్రవక్త అయినా గాని, దేవునికి మాత్రం ప్రియమైనవాడు. ఆ దేశప్రజలంతా అతణ్ణి, అతని ద్వారా వచ్చిన దేవుని సందేశాన్ని నిరాకరించారు. కనుక అతనికి “విలపించే ప్రవక్త” అనే పేరు రావడంలో వింత లేదు. ప్రవక్తగా అతనిమీద ఉన్న భారం భరించలేనంతగా అనిపించడం చేత కొన్ని సార్లు దానినుండి తప్పించుకోవాలని కోరాడు. కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ మళ్ళీ తన బాధ్యతనుబట్టి ప్రయాసపడేవాడు చాలా హింసనూ విచారకరమైన పరిస్థితులనూ అనుభవించవలసి వచ్చినా యిర్మీయా వెనక్కు తీయక “ఇనుప స్తంభంలాగా, కంచు గోడల్లాగా నిలబడ్డాడు.
వ్రాసిన కాలం:
రమారమి క్రీ.పూ. 580 ముఖ్యాంశాలు:
క్రీస్తుకు పూర్వం 586లో బబులోను సైన్యాలు వచ్చి జెరుసలంను పట్టుకొని ప్రజలను బందీలుగా తీసుకువెళ్ళారు. అదివరకు దేవునిమీద తిరుగుబాటు చేసిన ఆ ప్రజలను యిర్మీయా జాలితో కన్నీళ్ళతో హెచ్చరిస్తూ బతిమిలాడుతూ వచ్చాడు. ఇస్రాయేల్ ప్రజ డెబ్భై ఏండ్లు బబులోనులో ఉన్న తరువాత తిరిగి వస్తారని దేవుని మూలంగా తెలియజేశాడు. తరువాతి అధ్యాయాలలో, తన ప్రజలతో దేవుడు చేసే క్రొత్త ఒడంబడికను, బబులోనుకూ ఇతర దేశాలకూ ఆయన తీర్చే తీర్పులను వెల్లడి చేశాడు. ప్రస్తుతం దేవుని సేవ చేస్తున్నవారు నేర్చుకోడానికి ఈ పుస్తకంలో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయి. దేవుని సేవకుడు ఎలా ఉండాలి అనడానికి అనేక రీతులుగా యిర్మీయా ఒక ఆదర్శ వ్యక్తిగా ఉన్నాడు. ఈ వాక్యభాగాలు క్రీస్తు రాకను గురించి తెలియజేస్తున్నాయి: 23:5; 30:4-11; 31:31-34; 33:15-18.
విషయసూచిక
దేవుడు తన పనికి యిర్మీయాను పిలిచాడు 1:4-19
ఇస్రాయేల్ పాపం, కృతజ్ఞత లేకపోవడం 2:1—3:5
ఇస్రాయేల్ నమ్మకంగా ఉండకపోవడం, దేవుని నిరంతర ప్రేమ 3:6—4:4
బబులోనువారినుండి రానున్న నాశనం గురించి ముందుగా చెప్పడం 3:6—6:30
యూదా దుర్మార్గం, మోసం 5:1-13
యూదా దొంగ భక్తి 7:1-31
దొంగ భక్తికి వచ్చే శిక్ష 7:32—8:17
యిర్మీయా విచారం 8:18—9:2
దేవుని విచారం 9:3-26
నిజమైన దేవుడు, జనాల విగ్రహాలు 10:1-16
రానున్న నాశనం, యిర్మీయా ప్రార్థన 10:17-25
యూదా దేవుని ఒడంబడికను మీరింది 11:1-17
యిర్మీయాను చంపడానికి పాపుల ఎత్తుగడ 11:18-23
యిర్మీయా మొర, దేవుని జవాబు 12:1-17
అవిసెనార నడికట్టు గుర్తు 13:1-11
చెరను గురించి హెచ్చరిక 13:15-27
కరవు, దేవుని సందేశం 14:1—15:14
యిర్మీయా ప్రార్థన, దేవుని వాగ్దానం 15:15-21
పెండ్లికాని ప్రవక్తకు దేవుని సందేశం 16:1—17:18
విశ్రాంతిదినం గురించి హెచ్చరిక 17:19-27
కుమ్మరివాని ఇంటిదగ్గర దేవుని సందేశం 18:1—19:15
దేవుడు కుమ్మరి 18:5-6
దేవాలయ అధికారి యిర్మీయాను కొట్టించాడు 20:1-6
యిర్మీయా ఫిర్యాదు 20:7-18
సిద్కియా విన్నపం, దేవుని జవాబు 21:1-14
దుష్ట రాజుల ఖండన 22:1-30
దుష్ట కాపరులు, న్యాయవంతుడైన కొమ్మ 23:1-8
మోసగాళ్ళైన ప్రవక్తలు 23:9-40
రెండు బుట్టల అంజూరం పండ్లు 24:1-10
70 ఏండ్ల చెర గురించి ముందుగా చెప్పడం 25:1-14
దేవుని కోప పాత్ర 25:15-38
యాజులు, ప్రవక్తలు చేరి యిర్మీయాను చంపే ప్రయత్నం 26:1-24
కాడి ఉదాహరణతో పాఠం: యూదా ముందుకు నెబుకద్నెజరు దగ్గర సేవచేయాలి 27:1-22
అబద్ధ ప్రవక్త హనన్యా 28:1-17
బబులోనులో ఉన్న యూదులకు యిర్మీయా లేఖ 29:1-23
అబద్ధ ప్రవక్త షెమయాకు తీర్పు 29:24-32
ఇస్రాయేల్‌ను దేవుడు చెరనుండి తీసుకువస్తాడు 30:1—31:30
క్రొత్త ఒడంబడిక 31:31-40
యిర్మీయా ఒక పొలాన్ని కొన్నాడు,
దానిగురించి దేవుని సందేశం 32:1-44
ఇస్రాయేల్‌కు భవిష్యత్తులో రానున్న దీవెన 33:1-26
సిద్కియారాజును దేవుడు హెచ్చరించాడు 34:1-7
బానిసలు, దేవుని సందేశం 34:8-22
విధేయులైన రేకాబు వంశీయులు, అవిధేయుతగల యూదా 35:1-19
యిర్మీయా వ్రాతప్రతులను యెహోయాకీం కాల్చివేశాడు 36:1-32
కారాగారంలో యిర్మీయా 37:1-21
బావిలో యిర్మీయా 38:1-13
బావిలో నుండి యిర్మీయాను సిద్కియా బయటకు తీసి ప్రశ్నించాడు 38:14-28
జెరుసలం పతనం 39:1-18
యిర్మీయాకు విడుదల 40:1-6
అధిపతి గెదల్యా మరణం 40:7—41:3
దుష్ట ఇష్మాయేల్ 41:4-15
ఈజిప్ట్‌కు తప్పించుకొని పోవడం 41:16—43:13
ఈజిప్ట్‌లో ఉన్న వారికి హెచ్చరికలు 44:1-30
బారూకుకు దేవుని సందేశం 45:1-5
వేరువేరు దేశాల గురించి దేవుని మూలంగా వచ్చిన మాటలు 46:1—51:64
ఈజిప్ట్ 46:1-28
ఫిలిష్తీయా 47:1-7
మోయాబు 48:1-47
అమ్మోను 49:1-6
ఎదోం 49:7-22
దమస్కు 49:23-27
కేదారు, హాజోరు 49:28-33
ఏలాం 49:34-39
బబులోను 50:1—51:64
జెరుసలం పతనం గురించి మరోసారి లిఖితం 52:1-34
యూదా పతనము, చెర 52:1-30
యెహోయాకీను బబులోనులో విడుదల 52:31-34
No comments:
Post a Comment