రారే చూతము రాజ సుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ (2)
రాజితంబగు తేజమదిగో (2) || రారె ||
1. దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ డెల్పాగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగే నీ దినమున (2) || రారే ||
2. కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానది తేజరిల్లెడి (2)
తారగాంచరే త్వరగ రారే (2) || రారే ||
3. బాలుడడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాల వృద్ధుల (2)
నేల గల్గిన నాధుడు (2) || రారే ||
No comments:
Post a Comment