మారాలి మారాలి మన పాత రోత జీవితం మారాలి
చేరాలి చేరాలి యేసుని పాదాల చెంత చేరాలి
దీపమున్న నాడే ఇల్లు చక్కదిద్దుకుంటే మంచిది
శక్తి ఉన్ననాడే భక్తి లోన ఉంటే చాలా మంచిది
యవ్వనం కాలం యేసులోన ఉంటే చాలా మంచిది
మరి మంచిది ఇంకా మంచిది మరి మంచిది
(మారాలి మారాలి)
1.లోకపు కడలిలో లోతున బడి ఉన్నా
లేపగ యేసు చేయి చాచి ఉన్నది
పాపపు జగతిలో సతమౌతున్న
రక్షణ నీయగ నిలుచున్నది (2)
ప్రేమ మాట విని యేసు బాటలోనికొస్తే మంచిది
బాటలోనికొచ్చి మాట మారకుంటే చాలా మంచిది
యేసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది మరి మంచిది ఇంకా మంచిది మరి మంచిది
(మారాలి మారాలి)
2.చీకటి బ్రతుకులో మాటు దాగి ఉన్న
నిను గమనించు యేసు కన్నులున్నవి
శాపములోబడి నశియించు చున్న
నీకై కన్నీరు కార్చుచున్నవి
తప్పు దాచిపెట్టకుండ నువ్వు ఒప్పుకుంటే మంచిది
ఒప్పుకున్న తప్పు చేయకుండ ఉంటే చాలా మంచిది 2
యేసు వైపు చూచి నిన్ను దిద్దుకుంటే ఇంకా మంచిది
మరి మంచిది ఇంకా మంచిది మరి మంచిది
(మారాలి మారాలి)
No comments:
Post a Comment