రచయిత:
తెలియదు.
వ్రాసిన కాలం:
ఈ పుస్తకం బహుశా మోషే, ఎజ్రా కాలాల మధ్యలో రాయడం జరిగి ఉండవచ్చు. చాలామంది పండితులు అభిప్రాయపడిన ప్రకారం రాజైన సొలొమోను పరిపాలించిన చివరి రోజులలో రాసినదై ఉండవచ్చు. యోబు నివసించిన కాలం కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. కానీ మనకు లభించిన ఆధారాల ప్రకారం అబ్రాహాము జీవించిన తరువాత కొద్దికాలానికి యోబు జీవించాడని అర్థం అవుతుంది. ఏది ఏమైనా ఈ పుస్తకం ఎప్పుడు, ఎవరు రాశారు అన్న విషయాలు ఈ పుస్తకంలోని ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడవు. మన ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మిక విషయాలమీదే ఉండాలి.
ముఖ్యాంశం:
ఇది జీవిత సమస్యలలో ఒక కఠినమైన సమస్యను గురించిన రచన – దేవుడు ఎందుకు న్యాయవంతులను బాధలు అనుభవించనిస్తాడు? వారికి కష్టాలు, విపత్తులు, వేదనలు రావడం దేనికి? ఈ లోకంలో ఎందుకు న్యాయం తప్పినట్లుంది? ఈ ప్రశ్నల విషయం కావ్యరూపంలో యోబుకూ అతని మిత్రులకూ జరిగిన చర్చ ఇది. ఇది 3:1, 20; 4:7-9; 8:3; 18:5-21; 21:4-34; 34:10-12 నోట్స్ చూడండి. ఇంకా ఈ పుస్తకంలో సైతాను దేవునితో సవాలు చేసి యోబుమీద దండెత్తడం, సైతాను సవాలును దేవుడు విజయవంతంగా ఎదుర్కోవడం చూస్తాం.
విషయ సూచిక :
యోబు జీవితం, కుటుంబం, ఆస్తిపాస్తులు 1:1-5
సైతానుకు దేవునికి మధ్య సంభాషణ 1:6-12
యోబు పై విపత్తులు 1:13-19
విపత్తుల సమయంలో యోబు గొప్ప ప్రవర్తన, అతని మాటలు 1:20-22
సైతానుకు దేవునికి మధ్య మరింత సంభాషణ 2:1-6
సైతాను యోబు ఆరోగ్యం మీద దెబ్బ తీయడం 2:7-8
యోబు భార్య 2:9
యోబు గొప్ప సమాధానం 2:10
యోబు స్నేహితుల రాక 2:11-13
యోబు తాను పుట్టిన రోజును శపించడం 3:1-26
ఎలీఫజు మొదటి మాటలు 4:1—5:27
ఎలీఫజుకు యోబు సమాధానం 6:1—7:21
బిల్దదు మొదటి భాషణ 8:1-22
బిల్దదుకు యోబు సమాధానం 9:1—10:22
జోఫరు మొదటి భాషణ 11:1-20
జోఫరుకు యోబు సమాధానం 12:1—14:22
ఎలీఫజు రెండో భాషణ 15:1-35
యోబు సమాధానం 16:1—17:16
యోబుకు తట్టిన గొప్ప ఆలోచన 16:19-21
బిల్దదు రెండో భాషణ 18:1-21
యోబు సమాధానం 19:1-29
యోబు చెప్పిన అద్భుతమైన మాటలు 19:25-27
జోఫరు రెండో భాషణ 20:1-29
యోబు సమాధానం 21:1-34
ఎలీఫజు మూడో భాషణ 22:1-30
యోబు సమాధానం 23:1—24:25
బిల్దదు మూడో భాషణ 25:1-6
యోబు సమాధానం 26:1—31:40
యోబు నిశ్చయత 26:3-6
జ్ఞానానికి మార్గం 28:28
యోబు తన జీవిత విధానాన్ని తెలియజేయడం 29:11-17; 31:1-40
ఎలీహు భాషణ 32:1—37:24
దేవుడు సుడిగాలిలో నుంచి మాట్లాడడం 38:1—41:34
దేవుడు అడిగిన ప్రశ్న 38:2
విశ్వాన్ని సృష్టించి కాపాడుతున్న గొప్ప సృష్టికర్త 38:3—39:30
దేవుడు యోబును అడిగిన మరొక ప్రశ్న 40:1-2
దేవునికి యోబు సమాధానం 40:3-5
దేవుడు యోబును ఇంకా ప్రశ్నలడగడం 40:6-14
రెండు బ్రహ్మాండమైన మృగాలు 40:15—41:34
యోబు దేవునికిచ్చిన సమాధానం, అతని పశ్చాత్తాపం 42:1-6
దేవుడు ఎలీఫజుతో మాట్లాడడం 42:7-8
ఎలీఫజు అతని స్నేహితుల విధేయత 42:9
దేవుడు యోబును ఆశీర్వదించడం 42:10-15
యోబు సుదీర్ఘ జీవితం 42:16
No comments:
Post a Comment