Breaking

Monday, 22 November 2021

శీతకాలంలో శ్రీ యేసుని శుభవార్త - seethakalamulo sree yesuni subavartha song lyrics

 





శీతకాలంలో శ్రీ యేసుని శుభవార్త

మహిమ స్వరూపుడు మానవ రూపిగా

మరియకు సుతుడయ్యే నేడు

లోకానికి రక్షకుడుదయించే

ఓ ఓ ఓ ఓ

ప్రతి గొంతు జో లాలి పాడే

మనసులే ఉరకలేసిన వేళ

మధుర తలపు సుధలే


1. పరము నుండి వచ్చినాడు మనలను రక్షించుటకు

వేగిరపడుదామా ఓ సర్వ జనాంగమా

నిజ రక్షకుని ఆరాధిస్తూ దీవెనలే పొందుదాం

మదిలో యేసుని జన్మను తలచిన మనమే ధన్యులము

లోకానికి రక్షకుడుదయించే

ఓ ఓ ఓ ఓ

శోకాలను తీర్చును ఈనాడే

మనసులే ఉరకలేసిన వేళ

మధుర తలపు సుధలే


2. సంఘ సహవాసము కలిసి సువార్తకెల్లొద్దాం

బంధు మిత్రులంతా కలిసి ఆలయానికెలొద్దాం

కానుకలు అర్పిద్దాం మనసార ప్రార్ధిద్దాం

మదిలో యేసుని స్మరనే నిత్యం

అదియే ఆశీర్వాదం

నీతి సూర్యుడుదయించేనండి

ఓ ఓ ఓ ఓ

నిజ క్రిస్మస్ పండుగ సందడి 

మనసులే ఉరకలేసిన వేల 








No comments:

Post a Comment