Breaking

Tuesday, 23 November 2021

చుక్క పుట్టింది - Chukka Puttindi song lyrics


 


Chukka Puttindi song lyrics : 


వాక్యమే శరీర ధారియై – లోక రక్షకుడు ఉదయించె

పాపాన్ని శాపాన్ని తొలగింపను – రక్షకుడు భువికేతెంచెను

ఊరు వాడా వీధులలో – లోకమంతా సందడంటా

ఆడెదము కొనియాడెదము – అరే పూజించి ఘనపరచెదం


చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో

రాజు పుట్టినాడు ఏలో ఏలేలో – కొలవబోదామా ఏలో


గొర్రెల విడచి మందల మరచి గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మా

గానములతో గంతులు వేస్తూ గగనాన్నంటేలా ఘనపరచెదం (2)

చీకట్లో కూర్చున్న వారి కోసం – నీతి సూర్యుడేసు ఉదయించే

పాపాన్ని శాపాన్ని తొలగింపను – పరమును చేర్చను అరుదించే


ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు

ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం


చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో

పొలమును విడచి ఏలో ఏలేలో – పూజ చేద్దామా ఏలో


తారను చూచి తరలి వచ్చాము తూర్పు దేశపు జ్ఞానులము

తన భుజముల మీద రాజ్య భారమున్న తనయుడెవరో చూడ వచ్చామమ్మా (2)

బంగారు సాంబ్రాణి బోళములు – బాలునికి మేము అర్పించాము

మా గుండెల్లో నీకేనయ్యా ఆలయం – మా మదిలో నీకేనయ్యా సింహాసనం


ఈ బాలుడే మా రాజు – రాజులకు రారాజు

ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దాం


చుక్క పుట్టింది ఏలో ఏలేలో – సందడి చేద్దామా ఏలో

జ్ఞాన దీప్తుడమ్మా ఏలో ఏలేలో – భువికేతెంచెనమ్మా ఏలో


నీవేలే మా రాజు – రాజులకు రాజు

నిన్నే మేము కొలిచెదము – హోసన్న పాటలతో

మా హృదయములర్పించి – హృదిలో నిను కొలిచి

క్రిస్మస్ నిజ ఆనందం – అందరము పొందెదము




No comments:

Post a Comment