రచయిత:
ఒక పురాతన యూద సాంప్రదాయం ప్రకారం ఎజ్రా ఈ పుస్తకాన్ని వ్రాశాడు. కాని మొదటి వచనంలో “నెహెమ్యా మాటలు” అని ఉంది. ఎజ్రా ఈ పుస్తకాన్ని వ్రాసి ఉంటే నెహెమ్యా నుండి అతడు సేకరించిన సమాచారాన్ని వ్రాశాడని స్పష్టమౌతుంది.
వ్రాసిన కాలం:
సుమారు క్రీ.పూ. 430.
ముఖ్యాంశం:
జెరుసలం గోడలను తిరిగి కట్టడం, ప్రతిపక్షాలనుండి యూదులకు ఎలాంటి విరోధం ఎదురైంది, దాన్ని వారు ఎలా జయించారు, నెహెమ్యా, ఎజ్రాలు తమ నాయకత్వం ద్వారా సద్భక్తితో ఎలా జీవించాలో ప్రజలకు బోధించి తర్బీదునిచ్చారు.
విషయ సూచిక
జెరుసలం గురించి నెహెమ్యా విచారం, అతని ప్రార్థన 1:1-11
పారసీక రాజు నెహెమ్యాను జెరుసలంకు పంపాడు 2:1-10
నెహెమ్యా జెరుసలం గోడలను చూడడం 2:11-16
“గోడలను తిరిగి నిలుపుదాం రండి” 2:17-18
విరోధం ఆరంభం 2:19-20
గోడలు తలుపుల మరమ్మత్తు 3:1-32
మరింత ఎదిరింపు నెహెమ్యా ఎలా ఎదుర్కొన్నాడు 4:1-23
బీదల స్థితి, నెహెమ్యా వారికోసం ఏమి చేశాడు 5:1-19
విరోధం కొనసాగింది, నెహెమ్యా ఎలా ప్రవర్తించాడు 6:1-14
గోడ పూర్తి అవ్వడం 6:15-19
జెరుసలంను భద్రపరచడం గురించి వాద ప్రతివాదనలు 7:1-3
చెరనుండి తిరిగి వచ్చి వారి జాబితాలను నెహెమ్యా కనుగొనడం 7:4-73
దేవుని ధర్మశాస్త్రాన్ని ఎజ్రా ప్రజలకు చదివి వినిపించాడు 8:1-12
పర్ణశాలల పండుగ 8:13-18
యూదులు వారి పాపాలను ఒప్పుకొన్నారు 9:1-3
యెహోవా చేసిన గొప్పకార్యాలను గుర్తుచేసుకుంటూ ఒక ప్రార్థన 9:5-37
వ్రాతపూర్వకమైన ఒడంబడిక 9:38—10:39
జెరుసలంలోను యూదాలోను క్రొత్త నివాసులు 11:1-36
యాజులు, లేవీవారు జాబితాలు 12:1-26
జెరుసలం గోడలను ప్రతిష్ఠించడం 12:27-43
దేవాలయంలో అర్పణలు, సేవలు 12:44-47
నెహెమ్యా లేని సమయంలో ఏమి జరిగింది 13:1-9
నెహెమ్యా సంస్కరణలు 13:10-31
No comments:
Post a Comment