Breaking

Monday, 29 November 2021

ఎజ్రా (పరిచయం)

 



రచయిత:

ఒక పురాతన యూద సాంప్రదాయం ప్రకారం ఎజ్రా ఈ పుస్తకాన్ని, 1,2 దినవృత్తాంతాలు, నెహెమ్యా గ్రంథాన్ని వ్రాసాడు. ఎజ్రా అహరోను మనుమడైన ఫినెహాసు సంతతి వాడు (ఎజ్రా 7:1-5).


వ్రాసినకాలం:

సుమారు క్రీ.పూ. 440.


ముఖ్యాంశం:

యూదులు జెరుసలంకు, యూదాకు తిరిగి రావడం, దేవాలయాన్ని తిరిగి కట్టడం, యూదులకు ప్రతిపక్ష విరోధం, వారి విజయం, జెరుబ్బాబెలు, ఎజ్రాల నాయకత్వం.

విషయసూచిక

కోరెషు రాజాజ్ఞ 1:1-4

చెరలో నుండి మొదట ఒక గుంపు తిరిగి రావడం,

వారు తెచ్చుకొనినది 1:5—2:70

నిజదేవునికి ఒక బలిపీఠాన్ని కట్టడం 3:1-6

దేవాలయాన్ని తిరిగి కట్టడం ఆరంభించారు 3:6-13

దేవాలయం కట్టడానికి అడ్డగింపు 4:1-24

హగ్గయి, జెకర్యా ప్రవక్తలు, పని తిరిగి ఆరంభం 5:1-2

మరింత ప్రతిపక్ష విరోధం 5:3-17

దర్యావేషురాజు దేవాలయ నిర్మాణానికి ఆజ్ఞ ఇవ్వడం 6:1-12

పూర్తి అయిన దేవాలయాన్ని ప్రతిష్ఠించడం 6:13-18

చెర తరువాత జెరుసలంలో పస్కాను మొదటిసారిగా ఆచరించడం 6:19-22

ఎజ్రా జెరుసలంకు రావడం 7:1-10

అర్తహషస్తరాజు తాకీదు నకలును ఎజ్రాకు ఇచ్చాడు 7:11-26

ఎజ్రా దేవుణ్ణి స్తుతించాడు 7:27-28

ఎజ్రాతో కలిసివచ్చిన వారి వివరాలు 8:1-14

లేవీవారు లేకపోవడం 8:15-20

ప్రయాణం క్షేమంగా జరగడానికి ప్రార్థన 8:21-23

అపాయకరమైన ప్రయాణానికి సిద్ధపాటు,

జెరుసలంలో చేరడం 8:24-36

ఎజ్రా నాయకత్వంలో సంస్కరణలు 9:1—10:17

వర్ణాంతర వివాహాలు 9:1-4

ఎజ్రా చేసిన ఒప్పుకోలు ప్రార్థన 9:5-15

ప్రజలు వారి పాపాలు ఒప్పుకొని ఎజ్రాకు విధేయులయ్యారు 10:1-17

దోషులు 10:18-43

No comments:

Post a Comment