పేరు:
హీబ్రూ బైబిలులో 1,2 దినవృత్తాంతాలు ఒకే పుస్తకంలా కలిసివుండేవి. అయితే యూదులు పండితులు పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించేటప్పుడు దానిని రెండుగా విడదీశారు.
రచయిత:
యూదుల సాంప్రదాయం ప్రకారం ఎజ్రా 1,2 దినవృత్తాంతాలను వ్రాశాడు (ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలను కూడా).
వ్రాసిన కాలం:
బహుశా క్రీ.పూ. 450-430 మధ్యకాలంలో వ్రాసి ఉండాలి.
ముఖ్యాంశాలు:
ఇస్రాయేల్‌వారు ఏ వంశం నుండి వచ్చారో తెలియజేసే వంశావళులు అబ్రాహాము, నోవహు, ఆదాము వరకు చేరుతున్నాయి. ఈ పుస్తకం వివరించే సంఘటనలు చాలమట్టుకు దావీదు జీవితానికి సంబంధించినవే. ఈ రీతిగా చూస్తే దీనిని 2 సమూయేలు పుస్తకంతో సరిపోల్చవచ్చు. ఈ పుస్తకం దావీదు గొప్పతనాన్ని ఎత్తి చెప్తున్నదే గాని అతడు చేసిన పాపం, పొందిన శిక్షను గురించి చెప్పేది చాలా తక్కువ. బెత్‌షెబతో అతడు చేసిన పాపం, అలాగే అతనిపై అబ్‌షాలోం చేసిన తిరుగుబాటును గురించిన మాట ఏమీ లేదు. యెహోవా దేవునితో తమకు సరియైన సంబంధం ఉన్నప్పుడే యూదులు తమ దేశ ఉన్నతినీ మహిమనూ అనుభవించగలరని ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాన్ని, దీవెనలను పొందడానికి యెహోవాకు లోబడడమే మూలసూత్రం.
విషయసూచిక
ఆదాము దగ్గర నుండి దావీదు వరకు వంశావళులు 1:1—9:44
ఆదాము నుండి ఇస్రాయేల్ కుమారులవరకు 1:1-54
యాకోబు 12 మంది కుమారులు 2:1-2
యూదా సంతతులు 2:3—4:21
యబ్బేజు ప్రార్థన 4:9-10
షిమ్యోను సంతతివారు 4:24-43
రూబేను, గాదు, మనష్షే సంతతులు 5:1-26
లేవీ సంతతులు 6:1-80
ఇశ్శాకారు, బెన్యామీను, నఫ్తాలి, మనష్షే,
ఎఫ్రాయిం, ఆషేరు సంతతులు 7:1-40
బెన్యామీను నుండి సౌలు అతని కుమారుల సంతతులు వరకు 8:1-40
బబులోను చెర తరువాత జెరుసలంలో స్థిరపడిన యూదులు 9:1-34
సౌలు వంశావళి 9:35-44
సౌలు మరణం 10:1-14
దావీదు రాజయ్యాడు 11:1-3
దావీదు జెరుసలంను జయించాడు 11:4-9
దావీదు శూరులు 11:10-47
దావీదు మనుష్యులు అతన్ని ఎడారిలో కలుసుకొన్నారు 12:1-22
హెబ్రోనులో దావీదును కలుసుకొన్నవారు 12:23-40
మందసాన్ని తిరిగి తీసుకురావడానికి దావీదు ప్రయత్నం,
ఉజ్జా మరణం 13:1-14
జెరుసలంలో దావీదు 14:1-7
దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు 14:8-17
దావీదు మందసాన్ని జెరుసలంకు తిరిగి తీసుకురావడం 15:1—16:6
దావీదు స్తుతిగీతం 16:7-36
దావీదుతో దేవుని ఒడంబడిక 17:1-15
దావీదు ప్రార్థన 17:16-27
దావీదు విజయాలు 18—20 అధ్యాయాలు
దావీదు సైతాను ప్రేరేపణకు లొంగిపోయాడు 21:1-7
దావీదు పాపానికి వచ్చిన ఫలితాలు 21:8-17
దేవుని దూత ఖడ్గాన్ని ఆపుజేయడం 21:18-30
దేవాలయం కట్టడానికి సిద్ధపాట్లు 22:2-19
లేవీగోత్రికుల కుటుంబాల పనులు 23:1-32
యాజులలో విభజన 24:1-19
దేవాలయ ఆరాధనకు గాయకులు 25:1-31
దేవాలయ ద్వారపాలకులు 26:1-19
వివిధ అధికారులు 26:20-32
సైన్యం, అధికారులు 27:1-15
ఇతర అధికారులు 27:16-34
దేవాలయం కట్టడానికి దావీదు ఏర్పాట్లు 28:1-21
దేవాలయానికి కానుకలు 29:1-9
దావీదు ప్రార్థన 29:10-19
సొలొమోను రాజుగా స్థిరపడడం 29:21-25
దావీదు మరణం 29:26-30
No comments:
Post a Comment