Breaking

Friday, 19 November 2021

1 సమూయేలు (పరిచయం)

 



రచయిత:

తెలియదు.


వ్రాసిన కాలం:

మొదటిలో 1,2 సమూయేలు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు అనువాదకులు ఈ పుస్తకాన్ని రెండుగా విభజించారు. 1 సమూ 27:6లో రచయిత విడిపోయిన రాజ్యాన్ని సూచించగల యూదా రాజులను గురించి వ్రాస్తున్నాడు కాబట్టి, అతడు ఈ పుస్తకాలను సొలొమోను మరణించిన తరువాతనే వ్రాసి ఉండాలి అని చెప్పవచ్చు. సొలొమోను కుమారుడు రెహబాం కాలంవరకు రాజ్యం విడిపోలేదు.


ముఖ్యాంశాలు:

న్యాయాధిపతులలో లేక నాయకులలో సమూయేలు అత్యంత ఘనుడు. 1 సమూయేలులో అతని పుట్టుక, జీవితం, అతడు చేసినపని ఒక ముఖ్యాంశంగా ఉంది. మరొక ముఖ్యాంశం ఇస్రాయేల్‌వారు తమకు దేవుడు రాజుగా ఉండడానికి ఒప్పుకోకుండా ఒకతణ్ణి రాజుగా నియమించుకోవడం. మరో ముఖ్యాంశం: దావీదు జీవితంలోని ఆరంభ దశను మొదలుకొని సౌలు మరణించేంతవరకు జరిగిన సంగతులు. బైబిలులోని మిగతా భాగాలలాగే ఈ పుస్తకంలో నుండి కూడా ఇప్పటి విశ్వాసులు గ్రహించవలసిన ఆత్మసంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి (2 తిమోతి 3:16-17).



విషయసూచిక:

సమూయేలు తల్లి హన్నా 1:1-20

సమూయేలు పుట్టుక, బాల్యం 1:20-28

హన్నా గీతం 2:1-10

భక్తిహీనులైన ఏలీ కుమారులు 2:12-17

ఏలీ ఇంటిమీద దేవుని కోపం 2:27-36

దేవుడు సమూయేలును పిలవడం 3:1-21

దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుపోవడం 4:1-11

ఏలీ మరణం, ఇకాబోద్ పుట్టుక 4:12-22

దేవుని మందసం ఫిలిష్తీయ పట్టణాల మీదికి తెచ్చి పెట్టిన చేటు 5:1-12

మందసాన్ని ఇస్రాయేల్‌కు తిరిగి ఇచ్చివేయడం 6:1—7:1

మిస్పావద్ద ప్రజలు తిరిగి ప్రతిష్ఠించుకోవడం, ఫిలిష్తీయవారి ఓటమి 7:2-13

రాజుకోసం ప్రజల కోరిక 8:1-22

సౌలు, సమూయేలు 9:1-27

సమూయేలు సౌలును అభిషేకించడం 10:1-8

సౌలు రాజు కావడం 10:9-27

సౌలు అమ్మోనువారిని ఓడించడం 11:1-15

సమూయేలు చివరి ఉపదేశం 12:1-25

సౌలు ఒక హోమబలిని అర్పించడం, సమూయేలు అతణ్ణి ఖండించడం 13:1-15

కత్తులు, ఈటెలు లేని సైనికులు 13:16-22

యోనాతాను సాహసకార్యం 14:1-14

ఫిలిష్తీయవారిమీద విజయం 14:15-23

సౌలు తీర్మానం, యోనాతానుకు అపాయం 14:24-45

శత్రువులమీద సౌలు సాధించిన విజయాలు 14:46-52

అమాలేకువాళ్ళ పై యుద్ధం 15:1-33

సౌలు అవిధేయత 15:1-9

సమూయేలుద్వారా సౌలుకు దేవుని సందేశం,

సౌలును రాజుగా దేవుడు తిరస్కరించడం 15:8-35

సమూయేలు దావీదును అభిషేకించడం 16:1-13

సౌలు ఇంటిలో దావీదు 16:14-23

దావీదు గొల్యాతు 17:1-58

దావీదు మీద సౌలుకు అసూయ, భయం 18:1-16

సౌలు దావీదు చావును కోరడం 18:17-25

దావీదు సౌలు కూతురు మీకాల్‌ను పెండ్లాడడం 18:26-27

దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం 19:1-11

దావీదు తప్పించుకుపోవడానికి మీకాల్ సహాయం 19:12-17

సౌలు, అతని మనుషులు పరవశులై ప్రకటించడం 19:19-24

దావీదు, యోనాతానుల మధ్య అమోఘమైన స్నేహం 20:1-42

దావీదు నోబుకు తప్పించుకుపోవడం, అక్కడ ఒక యాజకుడు దావీదుకు

ప్రతిష్ఠితమైన రొట్టెను, గొల్యాతు ఖడ్గాన్ని ఇవ్వడం 21:1-9

గాతులో దావీదు పిచ్చివానిలాగా నటించడం 21:10-15

అదుల్లాం, మిస్పాకు దావీదు పారిపోవడం 22:1-5

నోబులో యాజులను సౌలు చంపడం 22:6-23

కెయీలా పట్టణాన్ని దావీదు కాపాడడం 23:1-13

జీఫువారు దావీదును మోసగించడం 23:14-29

దావీదు సౌలును ప్రాణంతో వదలడం 24:1-22

దావీదు, నాబాలు, అబీగేల్ 25:1-44

దావీదు సౌలు రెండోసారి ప్రాణంతో వదలడం 26:1-25

దావీదు, ఫిలిష్తీయవారి దగ్గరకు తిరిగి వెళ్ళడం 27:1-12

ఏన్‌దోరులో పూనకం వచ్చి పలికే స్త్రీని సౌలు దర్శించడం 28:1-25

ఫిలిష్తీయవారు దావీదును సిక్లగుకు తిరిగి పంపడం 29:1-11

దావీదు దేవునిలో ఆదరణను పొందడం 30:1-8

దావీదు అంతటిని తిరిగి చేకూర్చుకోవడం 30:9-31

గిల్బోవా కొండమీద సౌలు, యోనాతానుల మరణం 31:1-13

No comments:

Post a Comment