Breaking

Wednesday, 27 October 2021

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే - Veeche Gaalullo song lyrics

Veeche Gaalullo song lyrics 

 


Veeche Gaalullo song lyrics :


వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే


నీవే నా మంచి యేసయ్యా


ప్రవహించే సెలయేరై రావా నీవు


జీవ నదిలా మము తాకు యేసయ్యా


నీవే నా ప్రాణము – నీవే నా సర్వము


నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి


నీలోనే తరియించాలి ప్రభు (2)


నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం


నీవు లేకుంటే నేను జీవించలేను (2)     ||వీచే గాలుల్లో||



1.ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం


కడవరకు కాపాడే నీవే నా దైవం


పోషించే నా తండ్రి నీవే ఆధారం


కరుణగల నీ మనసే నాకు చాలును


నీ మాటలే మాకు ఉజ్జీవం


నీ వాక్యమే జీవ చైతన్యం (2)        ||నా ప్రియ యేసు||



2.ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం


ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై


నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే


నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి


మా కోసమే నీవు మరణించి


పరలోకమే మాకు ఇచ్చావు (2)        ||నా ప్రియ యేసు||


No comments:

Post a Comment