Breaking

Friday, 8 October 2021

Bible Quiz About Jesus

1➤ మరియ ఎవరికి ప్రధానము చేయబడెను?

=> యోసేపునకు

2➤ మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె ------- వలన గర్భవతిగా ఉండెను?

=> పరిశుద్ధాత్మవలన

3➤ మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక ------- గా ఆమెను విడనాడ ఉద్దేశించెను?

=> రహస్యముగా

4➤ ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు --------- అనెను?

=> భయపడకుమనెను

5➤ ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై మరియ ఒక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ----- అని పేరు పెట్టుదువనెను?

=> యేసు అని

6➤ యేసు అనే పేరుకు అర్థం ఏమిటీ?

=> రక్షకుడు

7➤ క్రీస్తు అను శబ్దమునకు అర్థం ఏమిటీ?

=> అభిషిక్తుడని అర్థము

8➤ ఇమ్మానుయేలను పేరునకు అర్థం ఏమిటి?

=> దేవుడు మనకు తోడని

9➤ యేసుక్రీస్తు జన్మించిన గ్రామం ఏది?

=> బెత్లహేము

10➤ యేసుక్రీస్తు ఏ వంశంలో జన్మించాడు?

=> దావీదు వంశంలో

11➤ యేసుక్రీస్తు ఏ గోత్రంలో జన్మించాడు?

=> యూదా గోత్రంలో

12➤ ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని ఎవరి వలన ఆజ్ఞ ఆయెను?

=> కైసరుఔగుస్తువలన

13➤ మరియ ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను?

=> బెత్లహేములో

14➤ మరియ తన తొలిచూలు కుమారుని కని, ----- గుడ్డలతో చుట్టెను?

=> పొత్తిగుడ్డలతో

15➤ మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, ----- లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను?

=> సత్రములో

16➤ కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎవరు వారియొద్దకు వచ్చి నిలిచెను?

=> ప్రభువు దూత

17➤ ప్రభువు మహిమ గొఱ్ఱెల కాపరుల చుట్టు ప్రకాశించినందున, వారు ----------- ?

=> భయపడిరి

18➤ ప్రభువు దూత గొఱ్ఱెల కాపరులతో - భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు ------- కరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాననెను?

=> మహాసంతోషకరమైన సువర్తమానము

19➤ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ------ అనెను ?

=> ప్రభువైన క్రీస్తు

20➤ ప్రభువు దూత గొఱ్ఱెల కాపరులతో - ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ------ పండుకొనియుండుట మీరు చూచెదరని చెప్పెను?

=> తొట్టిలో

21➤ పరలోక సైన్య సమూహము దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద --------- కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను?

=> సమాధానము

22➤ గొఱ్ఱెల కాపరులు ఎక్కడికి వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొనిరి?

=> బేత్లెహేమునకు

23➤ గొఱ్ఱెల కాపరులు త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న ------- ను చూచిరి?

=> శిశువును

24➤ గొఱ్ఱెల కాపరులు శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ------ చేసిరి?

=> ప్రచురము

25➤ గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమ పరచుచు ------ చేయుచు తిరిగి వెళ్లిరి?

=> స్తోత్రముచేయుచు

26➤ యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క -------- కొరకు కనిపెట్టువాడు?

=> ఆదరణ కొరకు

27➤ సుమెయోను మీద ------ ఉండెను?

=> పరిశుద్ధాత్మ

28➤ ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని సుమెయోనుకు ఎవరిచేత బయలుపరచబడి యుండెను?

=> పరిశుద్ధాత్మచేత

29➤ నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అని అన్నది ఎవరు?

=> సుమెయోను

30➤ నీ హృదయములోనికి ఒక ----- దూసికొనిపోవునని సుమెయోను మరియతో చెప్పెను?

=> ఖడ్గము

31➤ యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?

=> యెరూషలేముకు

32➤ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని జ్ఞానులు ఎవరితో చెప్పిరి?

=> హేరోదుతో

33➤ హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి, నక్షత్రము కనబడిన కాలము వారిచేత -------- గా తెలిసికొనెను?

=> పరిష్కారముగా

34➤ హేరోదు జ్ఞానులతో - మీరు వెళ్లి, శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని ఎక్కడికి పంపెను?

=> బేత్లెహేమునకు

35➤ క్రీస్తు ఎక్కడ పుట్టునని హేరోదు ఎవరినడిగెను?

=> యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను

36➤ జ్ఞానులు తల్లియైన మరియను శిశువును చూచి, సాగిలపడి, ఎవరిని పూజించిరి?

=> యేసుక్రీస్తును

37➤ జ్ఞానులు తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును ------- గా ఆయనకు సమర్పించిరి?

=> కానుకలుగా

38➤ హేరోదు నొద్దకు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై జ్ఞానులు ---------- మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి?

=> మరియొక మార్గమున

39➤ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ------- తెచ్చుకొనెను?

=> ఆగ్రహము

40➤ బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల -------- నందరిని వధించెను?

=> మగపిల్లలనందరిని

41➤ ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ------- నకు పారిపొమ్మని చెప్పెను?

=> ఐగుప్తునకు

42➤ యోసేపు లేచి, --- వేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లెను?

=> రాత్రి వేళ

43➤ హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని --------- దేశమునకు వెళ్లమని చెప్పెను?

=> ఇశ్రాయేలు దేశమునకు

44➤ యోసేపు స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, ----- అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను?

=> నజరేతు అను ఊరికి

45➤ ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ----- యుండెను?

=> ప్రవక్త్రి

46➤ అన్న దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు -------- చేయుచుండెను?

=> సేవ చేయుచుండెను

47➤ పస్కాపండుగప్పుడు యేసుక్రీస్తు తలిదండ్రులు ఏటేట ఎక్కడికి వెళ్లుచుండువారు?

=> యెరూషలేమునకు

48➤ యేసుక్రీస్తు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ------ అడుగుచు ఉండెను?

=> ప్రశ్నలడగుచు ఉండెను

49➤ యేసుక్రీస్తు మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును ------- నొందిరి?

=> విస్మయమొందిరి

50➤ యేసుక్రీస్తు తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ---------?

=> ఆశ్చర్యపడిరి

No comments:

Post a Comment