Breaking

Sunday, 12 September 2021

మారనిది మరువనిది వీడనిది | Maranidhi Maruvanidhi

 




ప్రేమ యేసయ్య ప్రేమా (4)
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)          ||ప్రేమ||


తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||


నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నను నిలబెట్టుకొన్న ప్రేమా (2)          ||ప్రేమ||


నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)
అరచేతుల్లో నను చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమా (2)          ||ప్రేమ||

No comments:

Post a Comment