Breaking

Saturday, 4 September 2021

Ascharyamaina prema - ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

 


ascharyamaina prema lyrics : 

ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ lyrics : 


ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది

నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||


1.పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||


2.పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే   ||ఆశ్చర్యమైన||


3.శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు             ||ఆశ్చర్యమైన||


4.నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||




No comments:

Post a Comment