పక్షి రాజు
పక్షుల్లో ప్రత్యేకమైన పక్షి
పక్షి రాజు జీవితం నుండి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయ్
ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో
పక్షి రాజును చూస్తే మనకర్థమౌతుంది
పక్షి రాజు లో ఉండే ఒక ఐదు లక్షణాలు మనలో ఉంటే
తప్పకుండా మనము విజయాన్ని సాధిస్తాం విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాం
పక్షి రాజులో ఉండే ఆ ఐదు లక్షణాలెంటో వాటిని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం
మొదటగా పక్షిరాజెప్పుడు కూడా మిగతా పక్షులన్నిటికంటే ఎత్తులో ఎగురుతుంది
వేటగాడు తక్కువ ఎత్తులో ఎగిరే మిగతా పక్షులను వేటాడొచ్చేమో గాని పక్షి రాజును మాత్రం వేటాడలేడు
వేటగానికి దొరకనంత ఎత్తులో పక్షిరాజు సంచరిస్తుంది
మన జీవితంలో ప్రత్యేకంగా ఉండడం మనము నేర్చుకోవాలి
మనము ఎదుగుతూ ఉంటే అది తట్టుకోలేక తొక్కేసే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు
మనము అనుకున్నది సాధించకుండా మనల్ని ఆపేసేవి మన చుట్టూ ఎన్నో ఉంటాయి వాటికి చిక్కకుండా వాటికి లొంగకుండా ఉండాలంటే మనల్ని మనం ప్రత్యేకపరచుకొని ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి
తాత్కాలిక సుఖాల కోసం ఆశపడి విలువైన మన సమయాన్ని విలువైణ మన జీవితాన్ని వృధా చేసుకోకుండా
పక్షి రాజు వలె ప్రత్యేకంగా జీవిస్తూ విజయ పతంలో పరుగులు పెడదాం
పక్షిరాజెప్పుడు ఒక గొప్ప vision ని కలిగి ఉంటుంది
అది వేటాడుతున్నప్పుడు పూర్తి focous ని దానిపై పెడుతుంది. తాను చూసింది పట్టుకునేంత వరకు
ఎన్ని distractions వచ్చిన అది distub అవ్వదు
జీవితంలో ఒక గురి కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి
అది సాధించేంత వరకు మన focus పూర్తిగా దానిపైనే ఉండాలి. మన దృష్టిని మల్లించేవి మనలో ఉన్న మంటను చల్లార్చేవి మన చుట్టూ ఎన్నో ఉంటాయి
వాటన్నింటిని అధిగమించి గురి వైపే చూస్తూ గురి యొద్దకు పరిగెత్తినప్పుడే గమ్యాన్ని చేరుకోగలమని విజయాన్ని సాధించగలమని గుర్తించాలి
పక్షిరాజు వలె గొప్ప vision ని కలిగి ఉంటూ
పట్టుదలతో పరుగులు పెట్టడం నేర్చుకుందాం
మూడవదిగా పక్షిరాజెప్పుడు చచ్చిన వాటిని తినదు
తాను వేటాడి సంపాదించుకున్న fresh food మాత్రమే తింటుంది
మన జీవితంలో మనము ఏం చూస్తున్నామో
ఏం వింటున్నామో ఏం ఆలోచిస్తున్నామొ
అనే విషయములో బహు జాగ్రత్త వహించాలి
ఏది పడితే అది చూస్తూ ఏది పడితే అది వింటూ
ఎలా పడితే అలా ఆలోచిస్తూ ఉంటే వాటితోనే మనము నింపబడి ఉంటాము
మన జీవితంలో ముందుకు వెళ్లకుండా పెద్ద అడ్డుబండళ్ళ అవి మనకు తయారౌతాయి
మన జీవితానికి ఉపయోగపడే మన బ్రతుకును మార్చగలిగే వాటిని వింటూ
మన వ్యక్తిత్వవాన్ని పెంచే విలువలని పంచె వాటిని చూస్తూ మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటు ముందుకు వెళ్దాం
అనవసరమైన వాటిని అసహ్య వాటిని విసర్జిద్దాం
నాల్గోదిగా పక్షిరాజు తఫాణులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటుంది
తుఫానొచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ తమ గూటి వైపు పరిగెడతాయి కానీ పక్షి రాజు మాత్రం ఆ తుఫానుకు ఎదురెళ్తుంది ఆ తుఫాను గాలులను ఆధారం చేసుకొనే తుఫానే లేని స్థలంలోకి అనగా మేఘాల పైకి వెళ్తుంది
మన జీవితంలో కూడా మన కెదురయ్యే ఆటంకాల్ని
అడ్డుబండలుగా భావిస్తే అవి అడ్డుబండలుగానే మిగిలిపోతాయి కానీ వాటిని అధిగమించడానికి
ప్రయత్నించి అలుపు లేకుండా పరిగెడితే
అవే మనకు ఆశీర్వాధాలుగా కూడా మారతాయి
పక్షి రాజు వలె proublems ని దైర్యంగా ఎదర్కొంటూ
అననుకూల పరిస్థితుల్లో కూడా ఆనందంగా జీవిద్దాం
ఐదోదిగా పక్షిరాజు తన జత పక్షిని పరీక్షించకుండా దానితో జత కట్టదు
పరీక్షలు ఒక వ్యక్తి యొక్క comitment ఏంటో తెలియజేస్తాయి. ఆ పరీక్షల్లో పాసైనప్పుడు మన commitment ఎంత కచ్చితమైందో రుజువౌతుంది
మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు మనం పని చేసే work place లో కావచ్చు కొంతమందిని పరీక్షిస్తేనే గానీ
వారెంటో మనకర్థమవ్వదు
మనతో కలిసి నడిచేవారు మనతో పాటు పని చేసే వారు ఎలాంటి వారో తెలియకుండా వారితో పాటు మన అడుగులు వేయడం అంత క్షేమం కాదు
నమ్మకమైన వ్యక్తులు మనతో ఉండడం
నమ్మకమైన వ్యక్తులతో మనము నడవడం
మన అభివృద్ధికి అది ఎంతో తోడ్పడుతుంది
జీవితంలో విజయం సాధించాలనుకునేవారు
విజయవంతమైన జీవితాన్ని జీవించాలనుకునేవారు
పక్షి రాజులో ఉన్న ఈ ఐదు లక్షణాలు కలిగి జీవిస్తే
అవి వారికి ఎంతగానో ఉపయోగ పడ్తాయి
కాబట్టి మనము పక్షి రాజు వలె ప్రత్యేకంగా జీవిస్తూ
జీవితంలో ఒక గురి కలిగి ఆ గురి యొద్దకే పరిగెడుతూ
మన జీవితానికి ఉపయోగపడే మన బ్రతుకును మార్చగలిగే వాటిని వింటూ
మనకెదురయ్యే ఆటంకాల్ని ఆశీర్వాధాలుగా మార్చుకుంటూ
నమ్మకమైన వ్యక్తులతో మన అడుగులు వేద్దాం
అభివృద్ధి బాటలో మన జీవితాన్ని పయనిద్దాం
No comments:
Post a Comment