Breaking

Tuesday, 15 June 2021

Telugu christian messages telugu - ఫరో రాజీ సూత్రాలు



1.ఫరో రాజీ సూత్రాలు

బైబిలు పరిభాషలో 'ఫరో” సైతానుకి గుర్తు. ఐగుప్తు లోకానికీ, పాపానికీ గుర్తు.
ఐగుప్తులోని ఇశ్రాయేలీయులను కనానుకి పోనియ్యకుండ ఫరో 4 విధాలుగా “రాజీ" ధోరణిలో అడ్డుకున్నాడు... ఇవిగో మా హాలు అన్నమాట! ద్వంద జీవితము)


I.దూరం పోవద్దు (నిర్గమ. 8:28)
(చదువులో, ధనసంపాదనలో, ఆస్తుల విషయంలో నీ వసతులను పెంచుకోవడంలో ఎంత దూరము పోగలవో, పో! ఆత్మీయ జీవితములో, ప్రార్థించుటలో నీవు దూరం పోవద్దు అంటాడు ఫరో)


II. పురుషులు మాత్రము వెళ్లుడి (నిర్గమ. 10:11)
(పై రెండు రాజీ పద్దతులు మోషే అహరోనులు తిరస్కరించేసరికి మూడవ దానిని విసిరాడు ఫరో. పురుషులే వెళితే, భార్యలూ పిల్లలూ మరి వాళ్ల సంగతేమిటి? ఇది కుటుంబ సమేతంగా ఆరాధించకుండా, కుటుంబాలను విడదీసే కుట్రగా ఉంది)


III. మందలు, పశువులను విడిచి వెళ్లండి (నిర్గమ. 10:24) (వీటిని విడిచి వెళ్తే, వారి మనస్సంతా మందలపైనే ఉండి, మరల వెనక్కి వస్తారనే కుయుక్తితో చెప్పాడు. అంతేకాదు, దేవునికి బలులు అర్పించాలంటే అవి తప్పనిసరిగా కావాలి. దేవునికి బలి అనే ఆరాధన చెందకుండా చేయాలి - ఇదీ
ఫరో యుక్తి) సాధ్యమైనంతవరకు అపవాది మనతో పోరాడతాడు. మనం వాటిని జయించిన కొద్ది, వాడు రాజీ పద్ధతిలో మన యొద్దకు వచ్చి, మనలను
లోబరచుకుని, బంధించి వేస్తాడు - జాగ్రత్త!


2. అడ్డములను పడగొట్టువాడు
మన ప్రభువు మన ముందు నడచి, మన యెదుటనున్న ప్రాకారాలను పడగొడతాడు. ఆనాటి ఇశ్రాయేలీయుల యెదుట ఆయన జరిగించింది
అదే! నాటి ప్రజలు భౌతికంగా ఎదుర్కొన్నవి, నేడు మనం ఆత్మీయంగా ఎదుర్కొంటున్నాం. వారు ఎదుర్కొన్నవి ఇవిగో...


I.ఫరో (నిర్గమ 5:2)
(తల పొగరుతో మాట్లాడిన ఫరో మెడలు వంచటానికి దేవుడు ఎన్నో సూచక క్రియలు చేసాడు. ఎన్ని చేసినను లోబడని ఫరో గొర్రెపిల్ల గరం రాగా లోబడి పంపించారు


II. ఎఱ్ఱ సముద్రము (నిర్గమ. 14:16)
(ప్రజలు ఎదుర్కొన్న 2వ అడ్డం, లేదా ఆటంకం ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం. తప్పించుకోలేని పరిస్థితి. దేవుడు సముద్రం వైపు నీ కర్ర చాపుము అన్నాడు. అంతే, సముద్రం పాయలైంది.
మనకును చేతిలో ఒక కర్ర ఉన్నది - అదే దేవుని వాక్యము!)


III. యొర్దాను (యెహో.3:14)
(నింద, అవమానములనే యొర్దాను ఎదురుకాగా, యెహోషువ ఏం చేసాడు? మందసం మోయు యాజకుల అరకాళ్లు మొర్దాను నీళ్లను తాకితే, ఎగువనుంచి పారే నీళ్లు ఆగిపోతాయని చెప్పాడు. దేవుని సన్నిధి అనే మందసాన్ని మోయు సేవకుల ద్వారా ఈ 3వ అడ్డమును ప్రభువు పడగొట్టాడు)


IV. యెరికో (యెహో, 6:1)
(యెరికో శాపానికి సాదృశ్యం. శాపానికి కారణం పాపము. దీనిని పడగొట్టుటకు ప్రభువు సూచించిన మార్గము - స్తుతి కేకలు! అవును, ఆర్భాటంతో స్తుతించినపుడు ప్రాకారాలు కూలిపోయాయి - యెహో, 6:20)


గొర్రెపిల్ల రక్తం ద్వారా ఫరో (సైతానూ), దేవుని వాక్యమనే కర్ర ద్వారా ఎర్రసముద్రము (సమస్యలూ), అభిషేకం కలిగిన సేవకుల ద్వారా నింద, అవమానములనే యొర్దానూ, స్తుతుల ద్వారా శాపమనే యెరికో గోడలు కూలిపోతాయి.

1 comment:

  1. Harrah's Cherokee Casino & Hotel - MapYRO
    Find your way around the casino, find where everything is 출장안마 located with the most up-to-date 1xbet 먹튀 information about 출장샵 Harrah's herzamanindir.com/ Cherokee Casino & Hotel in Cherokee, communitykhabar NC.

    ReplyDelete