నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? (2)
లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు (2)
ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
1. నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది /2/
నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/
2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు /2/
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/
No comments:
Post a Comment