Breaking

Wednesday 2 June 2021

దీవెనల యొక్క రహస్యము!

 



అనేక సంవత్సరముల క్రితము ఉద్యోగము వెతుకు నిమిత్తము ఇల్లువదలి వచ్చిన యవ్వనస్థుని దైవ సేవకుడొకడు కలుసుకొని నీవు ఎటువంటి పని చేయగలవని ప్రేమతో అడిగెను. కేవలము సబ్బు తయారుచేయుట మాత్రమే తానెరుగుదుననియూ,

దానిని బట్టి తన తండ్రికి సహాయముగా నుండినట్లుగాను చెప్పెను. ఇద్దరూ మోకరించిరి.

దైవజనుడు ఆసక్తిగా ప్రార్ధించి ఆశీర్వదించెను. “యవ్వనుడా, నీవు మొదట ప్రభువుకు నమ్మకస్తునిగా ఉండవలెను. క్రమముగా దశమ భాగము చెల్లించుము. రెండవదిగా నీ పనిలో నమ్మకముగా నుండుము. అతి శ్రేష్టమైన సబ్బునే ప్రజలకు అందించుము.” యవ్వనస్థుడు మరో స్నేహితునితో కలసి సబ్బుల కంపెనీ ప్రారంభించెను. ఒక డాలరు రాబడి దొరికిననూ దానిలో కూడా ప్రభువుకు పదియవ భాగము చెల్లించెను. కొంతకాలము తరువాత కంపెనీ పూర్తి బాధ్యతను వహించెను. వివాహము చేసికొనెను. వ్యాపారము విస్తరించెను. విస్తారముగా లాభము లభించెను. వ్యాపారము యింకనూ అభివృద్ధి చెందెను. రాబడిలో సగము ప్రభువు సేవకు ఉత్సాహంగా ఇచ్చెను. అతని

కుటుంబము వర్ధిల్లెను. బిడ్డలు ఒలీవ మొక్కలవలె ఎదిగిరి. తనకుగాని, తన బిడ్డలకు గాని ఏ కొదువ లేకుండెను కాబట్టి తన రాబడి యావత్తును దేవుని సేవకు వ్రాసియిచ్చెను. ఆయన పేరు “కోల్గేట్”. ప్రఖ్యాతిగాంచిన సబ్బులు, టూత్ పేస్టులు తయారు చేయువారు వారే!


నీ రాబడి అంతటిలో ప్రధమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును యిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. సామెతలు 2:9, 10.


No comments:

Post a Comment