Breaking

Sunday, 16 May 2021

Telugu christian message topic : నా కాపరి

 



నా కాపరి

దావీదు దేవుణ్ణి - “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు"అన్నాడు. ఒకాయన - “యెహోవా నా కాపరి, నాకు ఊపిరే లేదు"అన్నాట్ట. మన కాపరి ఎలాంటివాడో ... ఇదిగో...

i మంచి కాపరి - యోహాను 10:11
(మంచి కాపరి గనుకనే గొట్టెల కొరకు ప్రాణం పెట్టాడు. మంచికాపరి అంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడని అర్థం. స్వచిత్తానుసారంగా ఎటుబడితే అటు తిరగనిచ్చే కాపరి చెడ్డకాపరి. మంచి కాపరి తన చిత్తానుసారమైన త్రోవలయందే నడిపిస్తాడు)

ii. ఆత్మల కాపరి - 1 పేతురు 2:25
(ఆత్మల కాపరి గనుక ఈ మట్టి దేహమును విడిచిన ఆత్మలను తన రాజ్యములో భద్రపర్చును. అపవాది మన ఆత్మలను తస్కరించలేడు)

iii. ప్రధాన కాపరి - 1పేతురు 5:4

(ప్రధాన కాపరి గనుక ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. ఆయనిచ్చే బహుమానాలు అందరికన్నా శ్రేష్టమైనవి)

iv. గొప్ప కాపరి - హెబ్రీ 18:20

(మనలో తన ఉద్దేశములన్నిటిని నెరవేర్చును. ఏ ఒక్కటీ తప్పిపోవటానికి వీల్లేదు)

నా కాపరి - కీర్తన 23:1
(ఆయన నీకు కాపరిగా నుంటే లేమి అన్నదే నీకు కలుగదు. ఏది ఏమైన ఆయన నీ కాపరిగా మారాలి)
“కాపరి" అనే మాట ఎంత మధురమైనది! ఆయన భక్షించువాడు, కరచువాడు కాడు, ఆయన కాచే కాపరి. ఓ చిన్న బిడ్డ 28వ కీర్తన చెబుతూ - "యెహోవా నా కాపరి నాకు అంతే చాలు" అందట!

No comments:

Post a Comment