Breaking

Friday, 14 May 2021

Telugu christian message topic : ఘనురాలైన షూనేమీయురాలు

 


దైవభక్తి గలిగిన దైవజనుణ్ణి చేర్చుకొన్నది గనుకనే ఘనురాలని పిలువబడింది. ఈ ఘనత తనకు తానే వహించుకొనలేదు గాని దేవుడే ఆమెను ఘనురాలిగా ఎంచాడు. ఎలీషా వక్తకు ఆమె సిద్ధపరచినవి, ఏవనగా...

i.గది - 2రాజులు 4:8-10.
(యేసుకు మనం స్థలమియ్యాలి - యాయీరు ఇంటిలో ప్రభువుకి స్థలమిస్తే, చచ్చిన చిన్నది చటుక్కున లేచింది)

ii. మంచం - 2 రాజులు 4:8-10
(మంచం అనగా సహవాసము! ఎవరితో సహవాసము? -
“దేవునితో!” నీతో సహవాసం చేసేందుకు ఆయన ఇష్టపడుచున్నాడు)

iii. బల్ల - 2రాజులు 4:8-10
(బల్ల అంటే దేవుని ప్రజలతో సహవాసం. ఒంటిరామచిలుక లాగ ఒక్కడివే ఉంటే సరిపోదు. ఆత్మీయులతో సహవాసం చేసి బలపడాలి)

iv. పీఠ - 2రాజులు 4:8-10
(సువార్త కొరకు సిద్ధమనస్సు కల్గియుండాలి. బలిపీఠం, న్యాయపీఠం ఉన్నట్లే, సువార్త పీఠం కూడా ఒకటి ఉంది)

v. దీప స్థంభము - 2 రాజు 4:8-10
(నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని లేఖనంలో ఉంది సామె. 20:27. ఇది నిత్యము వెలుగుతూ ఉండాలి. కాబట్టి నూనె కావాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకం!)

ఈ షూనేమియురాలు తన భర్తతో ఎలీషాను గూర్చి - భక్తిగల దైవజనుడని నేనెరుగుదును అంటోంది. ఆమె సూక్ష్మమైన వివేచన కల్గిన స్త్రీ అన్నమాట. ఆధ్యాత్మిక విషయాల్లో భర్త కంటే ఫాస్ట్ గా ఉంది. అయితేనేమి ఆమెను గూర్చి సర్వం ఎరిగిన భర్త, కామ్ గా
లోబడ్డాడు. ఓ స్త్రీ నీవెలా ఉన్నావు?






No comments:

Post a Comment