యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
1యోహాను 4: 15
ప్రియులారా
యేసయ్య దేవుని కుమారుడని ఒప్పుకోవడమంటే ఆయనను, ఆయన చెప్పిన మాటలను నమ్మడమే.
ఆయన పై మనముంచిన నమ్మకం దేవునిలో మనముండేలా దేవుడు మనలో నిలిచి ఉండేలా చేస్తుంది
యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మన హృదయ మందు విశ్వసించినయెడల, మనము రక్షింపబడుదుము
ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది.
భక్తుడు ఈ విధంగా అంటున్నాడు
యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది;
యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.అని
ప్రియులారా
యేసే క్రీస్థై యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
ఈ వాక్యం మనము దేవుని కుమారుని యందు విస్వాసముంచి దేవునిలో నిలిచి ఉండాలని తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి ప్రేమించుచు దేవుని ఆజ్ఞలు నెరవేర్చువారమై యుందాం
అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్
No comments:
Post a Comment