నీతి మంతుల కొరకు వెలుగును యథార్థహృదయుల కొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
కీర్తనలు 97: 11
దేవుడు నీతిమంతులను ఆశీర్వదించును కేడెముతో కప్పినట్లు వారిని దయతో కప్పును కావున ఆయన నామమును ప్రేమించువారు ఆయనను గూర్చి ఉల్లసింతురు
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని
సహోదరి సహోదరులారా
దేవుడు తన కృప ద్వారా మనలను నీతుమంతులనుగా తీర్చాడు
మునుపు మనము పాపమునకు దాసులమై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారమై యుంటిమి
అయితే ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము; దాని అంతము నిత్యజీవము
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము అని వ్రాయబడి ఉంది
యేసయ్య ఈ విదంగా అంటున్నాడు
నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను అని
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, మనము వెలుగు సంబంధులవలె నడుచుకొనవలసినవారమైయున్నాము
No comments:
Post a Comment