మరువలేను దేవా నీ త్యాగమును
మరచిపోను రాజ నీ మేలులను
నా కోసం వచ్చావని నీ ప్రాణం ఇచ్చావని
నన్ను ప్రేమించావని నీ రక్షణ ఇచ్చావని
గూడు చెదరిన పక్షిని నేనై
గుండె చెదరిన వాడనైతిని (2 )
ఆదరించే వారు లేక ఆవేదన చెందితిని (2)
నన్నాధరించిన నా యేసయ్య
దారి తప్పిన గొర్రెను నేను
గమ్యమెరుగని బాటసారినై (2)
అలసి పోయి సొలసి పోయి నేనుండగా (2)
నూతన బలమిచ్చిన మృత్యుంజయుడా
మూగబోయిన వీణను నేను
మాటలాడక మౌనినైతిని (2)
పలుకరించే వారు లేక పలు నిందలు భరియించితి (2)
పేరు పెట్టి పిలిచినా ప్రేమామయ
No comments:
Post a Comment