యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును
కీర్తనలు 29: 11
సహోదరి సహోదరులారా దేవుడే మనకు ఆశ్రయం ఆయనే మన రక్షణ దుర్గము మన సరిహద్దులలో సమాదానము కలుగజేయువాడు ఆయనే
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు అని
మనము దేవుని వాక్యాన్ని ప్రేమించేవారముగా ఉన్నామా
జార్జీముల్లర్ అనే భక్తుడు తాను చనిపోయే లోపు 137 సార్లు బైబిల్ చదివాడట
రాబర్ట్ కాటన్ అనే భక్తుడు సంవత్సరానికి 12 సార్లు అంటే నెలకొక సారి బైబిల్ ను పూర్తిగా చదివేవాడట కీర్తనాకారుడు ఈ విదంగా అంటున్నాడు
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది అని
మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొనవలసిన వారమై యున్నాము
కొలస్సి 3:16లో
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి అని వ్రాయబడి ఉంది
సహోదరి సహోదరులారా
మన జీవితంలో సైతాను తెచ్చె ప్రతీ శోదనను
మనం జయించాలంటే వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకొని ఉండాలి
దేవుని వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను
వాక్యంతో నా హృదయాన్ని నింపుకుంటాను
వాక్యానుసారముగా జీవిస్తాను అన్నవారు
నాతో పాటు ప్రార్దనలో ఏకీభవించడి
పరిశుద్దుడా ప్రేమగల తండ్రి
నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు
అనుదినము వాక్యాన్ని ద్యానిస్తు ఆ వాక్యానుసారముగా మేము జీవించుటకు మాకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్దిస్తున్నాము తండ్రీ ఆమేన్
No comments:
Post a Comment