Breaking

Thursday, 29 April 2021

Daily bible verse in telugu




యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును
కీర్తనలు 29: 11
సహోదరి సహోదరులారా దేవుడే మనకు ఆశ్రయం ఆయనే మన రక్షణ దుర్గము 
మన సరిహద్దులలో సమాదానము కలుగజేయువాడు ఆయనే
భక్తుడు ఈ విదంగా అంటున్నాడు
నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు అని
మనము దేవుని వాక్యాన్ని ప్రేమించేవారముగా ఉన్నామా
 జార్జీముల్లర్ అనే భక్తుడు తాను చనిపోయే లోపు 137   సార్లు బైబిల్ చదివాడట 
రాబర్ట్ కాటన్ అనే భక్తుడు సంవత్సరానికి 12 సార్లు అంటే నెలకొక సారి బైబిల్ ను పూర్తిగా చదివేవాడట కీర్తనాకారుడు ఈ విదంగా అంటున్నాడు
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు 
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది అని
మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొనవలసిన వారమై యున్నాము
కొలస్సియులకు 3:16వచనంలో ఈ విదంగా వ్రాయబడీ ఉంది
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి అని
సహోదరి సహోదరులారా
 మన జీవితంలో సైతాను తెచ్చె ప్రతీ శోదనను
 మనం జయించాలంటే వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకొని ఉండాలి

No comments:

Post a Comment