బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
దానియేలు 12: 3
సిరియా దేశస్థులు ఇశ్రాయేలు దేశం నుండి చెరగొని తీసుకొని వచ్చిన చిన్నది నయమాను బార్యకు పరిచారము చేస్తూ ఉంది
సిరియా దేశానికి సైన్యాదిపతిగా ఉన్నటువంటి నయమాను కుష్ఠు రోగంతో బాదపడుతున్నాడు
తన యజమానుడు కుష్ఠు రోగంతో ఉండడం చూసిన ఆ చిన్నది
షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడని అక్కడికి వెలితే నయమానుకు కలిగిన కుష్ఠురోగమును బాగుచేస్తాడని వారితో చెప్పింది
తన తల్లిదండ్రులకు దూరం చేసి తనను బానిసగా తీసుకుని పోయిన వారిపై పగ ద్వేషం కోపం ఈవేవి తనలో ఉన్నట్లు కనిపించట్లేదు కాని
వారి బాగును వారి క్షేమాన్ని కోరుకుంటుంది ఈ చిన్నది కాబట్టే తనకు తెలిసిన సత్యాన్ని వారికి తెలియజేసింది
సహోదరి సహోదరులారా ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి అలాగే మీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు తెలియజేయండి యేసుక్రీస్తును తెలుసుకున్న అంద్రెయ
నతనయేలు దగ్గరికి వెళ్లి మేము మేస్సియాను కనుగొన్నాము ఆయన నజరేయుడగు యేసు అని చెప్పి నతనయేలును రక్షకుడైన యేసు దగ్గరికి నడిపించాడు
పాపిష్టి మనిషిని పరిశుద్దునిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయం తెలియక ఎంతోమంది నశించిపోతున్నారు వారికి క్రీస్తు ప్రేమను తెలియజేసే వారముగా మనము ఉండాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను
No comments:
Post a Comment