అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించు కొని.
2దినవృత్తాంతములు 33: 12
ప్రియులారా
మనషే అనే ఇశ్రాయేలీయుల రాజు దేవుని మాట
వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి
దేవునికి కోపం తెప్పించాడు అందువలన అతడు తన శత్రువుల చేతిలో చిక్కిపోయాడు
శత్రువులు తనను శ్రమలు పెడుతున్నప్పుడు అతడు ఆ శ్రమలలో దేవుడైన యెహోవాకు మోర పెట్టి తనను తాను బహుగా తగ్గించుకొని దేవుణ్ణి బ్రతిమిలాడుకొనెను హృదయపూర్వకముగా మనషే చేసిన ప్రార్ధనను దేవుడు అంగీకరించి మనషే శ్రమలలో నుండి అతని విడిపించి తిరిగి ఇశ్రాయేలీయులకు రాజుగా చేసాడు
దేవుని వాక్యం ఈ విధముగా చెబుతుంది
నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు
తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు అని
ప్రియులారా
మన దేవుడు కనికరము గల దేవుడు మనము చేసిన తప్పిదములను బట్టి పాపములను బట్టి మనలను శ్రమ పెట్టడు గాని మనము మారుమనస్సు పొందుకోవాలనే ఆశపడతాడు
తప్పిపోయిన కుమారుడు తన తప్పును తాను తెలుసుకొని తన్నుతాను ఎంతగానో తగ్గించుకొని
వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషి గొప్ప విందు చేసాడు
మనము కూడా ఆ కుమారుని వలె మనలను మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్ధించినట్లైతే
ఆయన కనికరము మనపై చూపించి
మనలను నీతిమంతులనుగా చేస్తాడు మన శ్రమాలన్నింటి నుండి గొప్ప విడుదలను ఇచ్చి
సమాధానంతో మన హృదయాన్ని నింపుతాడు
అటువంటి గొప్ప కృపకై మనము ప్రయాసపడువారమై యున్నాము ఈ వాక్యం మనకు శ్రమ వచ్చినప్పుడు
దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని
దేవుణ్ణి బ్రతిమిలాడే వారమై యుండాలని
మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కనికరము పొందుకుందాము దేవుని కృప మనకు తోడై యుండి
మనలను నీతిమంతులనుగా చేయును గాక ఆమెన్
No comments:
Post a Comment