Breaking

Saturday, 7 November 2020

దావీదు - అబీగయీలు

 


దావీదు గొల్యాతు ని చంపిన తిరిగి వస్తుండగా కొంతమంది స్త్రీలు వారిని ఎదుర్కొనుటకు వచ్చి సౌలు వేలకొలది దావీదు 10 వేల కొలది శత్రువులను హతముచేసెనని పాడిరి అది విన్న సౌలు అప్పటినుండి దావీదు మీద పగ పట్టెను కొన్ని సంవత్సరములు అయిన తర్వాత సౌలు తనను చంప జూచెనని అని దావీదు తెలుసుకొని అక్కడి నుండి పారిపోయెను దావీదు కొండలలోనూ గుహలలోను 

 ఉండగా సౌలు దావీదును తరుముతుండెను దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని పారిపోయేవాడు

 ఎందుకనగా దేవుని చేత అభిషేకించిన వారికి ఏ హాని చేయకూడదని అనుకొనెను కొన్ని దినములైన తరువాత దావీదు అతనితో ఉన్నవారందరూ కర్మెలు అనే ఊరికి సమీపాన ఉన్న అరణ్యములో నివసింప సాగిరి అయితే ఆ ఊరిలో నాబాలు అనే ఒక ఆస్తి గలవాడు ఉండెను దావీదు ఇది తెలుసుకొని నాబాలు దగ్గరకు కొంతమంది పనివారిని పంపి నాబాలుతో నీ గొఱ్ఱెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు వారికి మేము ఏ హానియు చేయలేదు వారు ఏ వస్తువును కూడా 

ఇక్కడ పోగొట్టుకోలేదు నీ గొఱ్ఱెల కాపరులకు మేము ఎంతో సహాయకరంగా ఉన్నాము కాబట్టి మేము తినుటకు ఆహారమును  పంపించమని వర్తమానము పంపెను 

అందుకు నాబాలు దావీదు ఎవడు యెషయి కుమారుడు ఎవడు నేను సంపాదించినది ఎవరికి ఇవ్వను ఎవరికి ఇవ్వనని చెప్పి వారిని పంపివేసెను 

ఇది తెలుసున్న దావీదు బహుగా కోపించి నాబులు 

చంపుటకు నాలుగువందలమంది సైన్యముతో బయలువెళ్లెను 

అయితే నాబాలుకు ఒక భార్య ఉంది ఆమె పేరు అబీగయీలు ఆమె సుబుద్ధి గలదై రూపసియై యుండెను ఆమె తన సేవకుని ద్వారా దావీదు నాబాలును చంపుటకు వస్తున్నాడన్న విషయం తెలుసుకొని బయపడి  నాబలుకు తెలియకుండా 

రెండు వందల రొట్టెలు రెండు వందల ద్రాక్ష రసపు తిత్తులు వండిన ఐదు గొఱ్ఱెల మాంసము ఐదు మాణికల  వేయించిన ధాన్యమును వంద ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అండలను 

తీసుకొని దావీదును ఎదుర్కొనుటకు వెళ్లెను 

అబీగయేలు దావీదును కనుగొని దావీదుతో నా ఏలిన వాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలనైనా నా మాటలను ఆలకించుము దుష్టుడైన నాబులను లక్ష్యపెట్టకు నీవు పంపిన నీ సేవకులు నాకు కనబడలేదు 

నీవు ఏ ప్రాణ హాని చేయకుము అయితే నేను నీకోసం తెచ్చిన ఈ కానుకలను నీ పనివానికిప్పించి 

నీ దాసురాలనైన నా దోషమును క్షమించుము 

దేవుడు నీకు ఎల్లవేళలా తోడుగా ఉండును నీవు ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించిన తర్వాత 

నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పెను అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక నేను ఎవ్వరిని చంపకుండా ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక 

నీవు చింపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అని చెప్పి ఆమె తీసుకు వచ్చిన కానుకను తీసుకొని నీవు సమాధానము గలదానవై వెళ్ళమని చెప్పెను అయితె జరిగిన విషయం నాబాలుకు అబీగయీలు తెలియజెప్పగా అతడు భయము చేత బిగుసుకు పోయెను 

పది దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా నాబాలు చనిపోయెను 

ఇది తెలుసుకున్న దావీదు అబీగయేలును వివాహము చేసుకొనెను 

పిల్లకు అబీగయేలు అందము అణుకువ కలిగిన స్త్రీ 

ఆమె తన భర్త వళ్ళ కలిగిన సమస్య తన  సమస్యగా భావించి ఎంతో ధైర్యముతో ఎంతో యుక్తితోను 

ఎదుర్కొనెను అబీగయేలు దేవుని యందు భయము 

గల స్త్రీ గనుకనే దావీదు ఆమెను వివాహము చేసుకొనెను 

మనము కూడా ఎదుటి వారి సమస్యను సమస్యగా భావించి  అందరికి సమాధానము కలుగజేసేవారముగా ఉండాలి 


No comments:

Post a Comment