సువార్త కరపత్రిక ఒక గొప్ప మేల్కొలుపుకు కారణమవుతుందని మీరు ఊహించగలరా? క్రీస్తును ప్రకటించుటలో ఒక శక్తివంతమైన సాధనంగా ఉన్న ఈ సువార్త కరపత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని రక్షణలోనికి నడిపించాయి.
ఒక రోజు ఒక రోగిని కలుసుకొనుటకు జాస్ స్కడర్ వేచియున్నప్పుడు, "లోకమును మార్చుట" అని రాసివున్న ఒక సువార్త కరపత్రికపై అతని దృష్టి పడింది. దానిని తీసుకొని చదివినప్పుడు అతని హృదయంలో ఏదో ఒక గొప్ప మార్పు సంభవించిన పొందారు.
వైద్య వృత్తి ద్వారా దేవుని సేవించుటకు
పిలుపునందుకుంటున్నట్లు అతను భావించారు. దేవుని పిలుపుకు అతను చూపించిన విధేయత భారతదేశంలో ఒక గొప్ప ఉజ్జీవం కలుగుటకు దారితీసింది.
శ్రీలంకకు వెళ్ళిన మొట్టమొదటి వైద్య మిషనరీగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన జాస్ స్కడర్, అటు తరువాత భారతదేశానికి వచ్చి 36 సంవత్సరాలకు పైగా అక్కడ తన సేవలనందించారు. అతని కృషి ఫలితంగా భారతదేశ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. తన పిల్లలందరినీ (ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు) మిషనరీ సేవ కొరకే సమర్పించిన జాస్ స్కడర్ యొక్క కుటుంబం నుండి మొత్తం 43 మంది దేవుని సేవ కొరకై తమను తాము సమర్పించుకున్నారు. వారిచే స్థాపించబడిన సంస్థలు వంద సంవత్సరములకు పైగా సమాజానికి సేవలనందిస్తూ ఇంకా కొనసాగించబడుతూనే ఉన్నాయి.
ఆసియాలోని మొట్టమొదటి బోధనావకాశాలతో కూడిన ఆసుపత్రి అయిన క్రిస్టియన్ మెడికల్
కాలేజీను (వెల్లూరు, తమిళనాడు) స్థాపించిన ఇడా స్కడర్ జాస్ స్కడర్ యొక్క మనుమరాలే.
క్రీస్తు పట్ల భక్తి సమర్పణలు కలిగిన అతని జీవితాన్ని ప్రజలకు సేవలందించుట కొరకు అంకితం చేసిన జాస్, భారత సమాజంలోని అణగారిన ప్రజల జీవితాలను ఉద్ధరించుటకు కృషి చేశారు. వారు తమ భౌతిక దేహములలో స్వస్థతను పొందుటకు మాత్రమే కాక ఆత్మీయ స్వస్థతను పొందుటకు కూడా అతను సహాయపడ్డారు. ప్రజల ఆత్మీయ అభివృద్ధి వలన
సమాజంలోని క్రమశిక్షణారహిత జీవితాలు కనుమరుగయ్యాయి. తన స్వంతగా అనేక
కరపత్రాలను వ్రాసిన జాస్, వాటిని పంచిపెట్టుటలో ఎన్నడూ అలసిపోలేదు, విసుగు చెందలేదు.
క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకునిగా ఈ లోకంలో తనకు అప్పగింపబడిన బాధ్యతలను అతను
విజయవంతంగా పూర్తిచేశారు.
ఒక చిన్న సువార్త కరపత్రిక వేలాది మంది జీవితాలను మార్చగలిగితే, అది మనకు కూడా సాధ్యమే! ప్రియమైన వారలారా, సువార్త కరపత్రాలను పంచిపెట్టుటలో మీ పాత్ర ఏమిటి?
"ప్రభువా, కరపత్రాల ద్వారా మీ ప్రేమను గూర్చి ప్రకటించుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆమేన్!
No comments:
Post a Comment