కీర్తనలు 115: 15
ప్రియులారా దేవుడే ఈ లోకంలో తన ప్రజలుగా ఉండటానికి మనలని ఎనుకున్నాడు. ఆయన తన మాట చేత సర్వ సృష్టిని సృజించినవాడు. ఆయన మహా శక్తిని బట్టి మనం అతిశయించువారమై ఉన్నాము యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు దేవుడైయున్నందుకు మనం ధన్యులమై ఉన్నాము. ఆయన ఆశీర్వదించిన యెడల అది ఏన్నటికిని ఆశీర్వాదగా ఉండును. ఆయన మనలను ఆశీర్వదించి తన ప్రజలుగా ఉండుటకు మనలను ఎనుకున్నాడు. గనుక మనకు ఆయన ఆశీర్వాదాలు ఎన్నటికిని ఆశీర్వాదముగానే ఉండును
ప్రియులారా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు.అ ఆశీర్వాదాలు సకల జనులకు ఆశీర్వాదకరంగా మారాయి. మనము కూడా ఆశీర్వదింపడానికే పిలువబడితిమి గనుక దూషణకు ప్రతి దూషణ చేయక ప్రతి వారు సమాధానముగా ఉండువారమై యున్నాము.
ఈ వాక్యము దేవుని చేత మనం ఆశీర్వదింపబడినవారము గనుక మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియ జేస్తుంది. అందుకే ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆశీర్వాదంకరంగా బ్రతుకుదాం.
దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనకు తోడైయుండును గాక ఆమెన్
No comments:
Post a Comment