రాబర్ట్ ఆనన్
ఆ రోజు జూలై 31, బుధవారం. ప్రజల కొరకు ప్రార్ధించుటకుగాను యథావిధిగా ఉదయం నాలుగు గంటలకే రాబర్ట్ నిద్ర లేచారు. అంతకుమందు రోజున పరిచర్య ముగించి వచ్చిన తరువాత అతను ఒక అనూహ్యమైన పని చేశారు. అదేమిటంటే “నిత్యత్వాన్ని నీవు ఎక్కడ గడుపుతావు?” అనే ప్రశ్నను రాసి తన ఇంటి వెలుపల ఒక బోర్డును వ్రేలాడదీశారు. ఆ రోజు ఉదయం పని చేయుటకు వెళ్ళబోతూ ఒక సుద్ద ముక్క తీసుకొని ఇంటి ద్వారము మీద “మరణం” అని, ద్వారము వెలుపల “నిత్యత్వం" అని రాశారు. తరువాత ఓడరేవు సమీపంలో
ఉన్న ఒక కట్టడ నిర్మాణ స్థలమునకు పని చేయుటకు వెళ్ళారు. సుమారు మధ్యాహ్న సమయంలో అక్కడి నదిలో జారి పడిపోయిన ఒక బాలుని ఆర్తనాదాలు విన్న రాబర్ట్, వెంటనే అక్కడికి పరుగెత్తుకొని వెళ్ళి ఆ బాలుని రక్షించుటకు నదిలోకి దూకారు. అతను మంచి
ఈతగాడైనప్పటికీ అక్కడి ఉధృతమైన ప్రవాహ తాకిడిని అతను తట్టుకొనలేకపోయారు.
సహాయం చేయుటకు వచ్చిన మరు రెండు పడవలలోని వారు ఆ బాలుని పైకి లాగుటకు
పట్టుకున్నారు. అయితే అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహ తాకిడికి రాబర్ట్ ఆ నీటిలో కనుమరుగయ్యారు. ఆ బాలుడి ప్రాణాన్ని కాపాడి, చివరికి తన స్వంత ప్రాణాన్ని తన రక్షకుని
చేతులకు అప్పగించారు రాబర్ట్ ఆనస్.
యువకుడిగా ఈతకొట్టుటలో నిష్ణాతుడైన రాబర్ట్, నదిలో మునిగిపోతున్న చాలామంది ప్రాణాలను కాపాడారు. కానీ, అతని జీవితం నిర్లక్ష్యంతో కూడిన జీవనశైలితో, దైవ
భయం ఎంతమాత్రం లేనిదిగా ఉండేది. అయితే దేవుని అదృశ్య ప్రేమాహస్తం ఒకానొక ఉజ్జీవ
కూడిక ద్వారా అతనిని రక్షణలోనికి నడిపించింది. అటుపిమ్మట అతను పూర్ణహృదయముతో
సువార్త సేవ జరిగించుటకు తనను తాను సమర్పించుకున్నారు. అప్పటినుండి తన
నగరంలోని నశించుచున్న ఆత్మలను క్రీస్తు యొక్క కృపాసువార్త యొద్దకు నడిపించుటయే
అతని ధ్యేయంగా మారింది.
అతని మరణ వార్తతో డండీ నగరం మొత్తం కదిలిపోయింది. అతను సువార్త
ప్రకటించినప్పుడు నిర్లక్ష్యం చేసినవారు, కొన్నిసార్లు అతని మీద శారీరకంగా దాడి చేసిన వారు
కూడా నిత్యత్వం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ విధంగా అతని మరణం ద్వారా
కూడా రాబర్ట్ అనేకమందిని క్రీస్తు నొద్దకు నడిపించారు. తాను జీవించిన కొద్దీ జీవితంలో దేవుని
కొరకు ఎంతో ఆసక్తి మరియు ఆయన బిడ్డల కొరకు ఎంతో భారమును కలిగి జీవించిన రాబర్ట్,
అనేక ఆత్మలను రక్షించిన ఒక గొప్ప వీరునిగా తన
పరుగును విజయవంతులుగా కడముట్టించారు.
No comments:
Post a Comment