నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
కీర్తనలు 5: 4
ప్రియులారా... దేవుడు పరిశుద్ధుడు ఆయన చెడుతనమును ద్వేషించినవాడు దుష్టక్రియలు చేయు వారికీ ఆయన విముకుడై యున్నాడు. దుష్ట ప్రవర్తన సాతానుయొక్క స్వాధీనం అది మనలో ఉన్నట్లయితే మనం సాతాను స్వాధీనంలో ఉన్నట్లు. పరిశుద్ధత దేవుని యొక్క వరం అది ఉన్నట్లయితే మనం ఆయన వారసులమే.
యోబు చెడుతనమును విసర్జించిన వాడై దేవుని దృష్టికి నీతిమంతునిగా మారాడు. దావీదు భక్తుడు కూడా బత్సేబాతో పాపం చేసిన తరువాత ఇటువంటి చెడుకార్యం జరిగించిన వానికి దేవునియొద్ద చోటులేదని గ్రహించి తన పాపము పోవునట్లుగా హిస్సోపుతో నను కడిగి హిమమకంటే తెల్లగా నను మార్చుమని దేవున్ని వేడుకున్నాడు.
ప్రియులారా.. ఆయన దృష్టత్వమును చూచి ఆనందించువాడు కాడు.. కనుక మనం కూడా యోబు భక్తునివలె మన చెడు స్వభావాన్ని విసర్జించి దేవుని పరిశుద్ధుత గలవారమై యుందాము. మనం పరిశుద్ధులమవుటకే పిలువబడితిమన్న మాటప్రకారం జీవించి ఆయన దృష్టికి నీతిమంతులమౌదాము.
ఈ వాక్యం మనలో ఏ దుష్టక్రియలను ఉంచుకోకూడదనితెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించి దేవుని దుష్టికి నీతిమంతులమవుదాం..
దేవుడు మన చెడు ప్రవర్తనలను తీసివేసి నీతిమంతులుగా మనలను చేయును గాకా..ఆమెన్
No comments:
Post a Comment