Breaking

Thursday, 17 September 2020

ఆండ్రూ ఫుల్లర్



 సెప్టెంబర్ 15 అపుడే సూర్యుడు ఉదయిస్తున్న సమయం అది, ఆ సమయములో పన్నెండు మంది కలిసి ప్రార్థన చేస్తుండగా దేవుడు వారికి చక్కని దర్శనం ఇచ్చారు. దేవుడు ఇచ్చిన ఆ దర్శనమును నెరవేర్చుటకు వారంతా ఏక మనస్సు కలిగి అంగీకరించిన మీదట బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ 1792 సం|| లో ఏర్పాటు చేయబడింది. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ స్థాపనలో ఆండ్రూ ఫుల్లర్ కీలక పాత్ర పోషించారు. అతను 22 సంవత్సరాలకు పైగా ఆ సంస్థ యొక్క ఉన్నత అధికారిగా పనిచేస్తూ దాని వృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అతనికి వేదాంతశాస్త్రంలో ఎటువంటి అధికారిక పట్టా లేనప్పటికీనీ అతని కాలపు అనేక మంది బైబిలు పండితులు అతని వ్యాఖ్యానమును మరియు ఉపదేశించే సామర్థ్యాన్ని ప్రశంసించారు. అతనిచే రచించబడిన 'అందరికి అంగీకారయోగ్యమైన సువార్త (ది గాస్పెల్ వర్ధి అఫ్ అల్ ఏక్సప్టెన్స్)' అనే పుస్తకం దేవుని సేవ కొరకై ప్రేరేపించేదిగా మరియు ఆలోచింపచేసి సవాలును విసిరేదిగా ఉన్నది. ఆండ్రూ ఫుల్లర్ కు సన్నిహితుడైన విలియం కేరీ కూడా ఈ పుస్తకం ద్వారా ఎంతో ప్రేరణ పొందారు. ఆండ్రూ ఫుల్లర్ 16 సంవత్సరాల వయస్సులో బాప్టిస్ట్ సంఘములో చేరి 21 సంవత్సరాల వయస్సులో అదే సంఘమునకు కాపరిగా నియమితులయ్యారు. అతను జీవితమంతా తనకు అప్పగింపబడిన పరిచర్యను తనకు కలిగిన దర్శనము చొప్పున చాలా శ్రద్ధతో నిర్వహించారు. సువార్తను ప్రకటించుటకు అనేక దేశాలను అతను సందర్శించారు. అనేక మిషనరీలను సిద్ధపరచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వారిని పంపించుట ద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయవచ్చని ఆయన విశ్వసించారు. తన రచనలు మరియు ఉపన్యాసాల ద్వారా మిషనరీ సేవ చేయుటకు ప్రజలలో దాహాన్ని కలిగించారు. అతని పరిచర్య తమను తాము దేవుని సేవకై సమర్పించుకొనులాగున అనేక మందిని కదిలించింది మరియు వారు తమ సమర్పణగల పరిచర్య ద్వారా ప్రపంచాన్నే కదిలించారు. ఆండ్రూ ఫుల్లర్ ను 'బాప్టిస్ట్ మిషనరీల తండ్రి' అని కూడా పిలుస్తారు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము అతనికి దేవుడు ఇచ్చిన తలాంతు. అతను లోతుగా ఆలోచిస్తూ తెలివిగా వ్యవహరిస్తూ నెమ్మదిగా మాట్లాడేవారు. చిన్నతనంలో అతను ఒక మల్ల యోధునిగా ఉన్నప్పటికీ తరువాత ప్రభు యొక్క పనిని సాధ్యమైనంత ఉత్తమంగా చేయడానికి తన శక్తిని అంతా వెచ్చించారు. ప్రియమైన వారలారా, దేవుని పని కోసం మీ బలమును వ్యయపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? "ప్రభువా, మీ సేవ చేయుటకు నన్నును నా పూర్ణ బలమును మీకే అంకితం చేస్తున్నాను. ఆమేన్!"

No comments:

Post a Comment