యెహోవా నా ఆశ్రయ దుర్గామ న విమోచకుడా నా నోటి మాటను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.
కీర్తనలు 19:14
ప్రియులారా దావీదు భక్తుడు చిన్నతనం నుండే దేవునియందు భయభక్తులు గలవాడు. దేవుడు హృదయమును పరిశీలించువాడని దావీదు కి తెలుసు. అందుకే తన నోటి మాట హృదయ ఆలోచనలను దేవునికి అంగీకారంగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు మన నోటిలో జీవ మరణములును ఉంచాడు. అందుకే మనం వ్యర్థంగా ఏదియు మాట్లాడకూడదు. మన హృదయాలను దేవుడు పరిశీలించువాడని మనం గ్రహించి ఎటువంటి చెడు మన హృదయంలో ఉండకుండా ఆయన దృష్టికి నీతిమంతులముగా ఉండాలి.
అప్పుడే మనం కూడా దావీదు వలే దేవునికి ఇష్టం అయినా వారముగా ఉంటాం. చాలా సార్లు మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండి అనేక శోదనలకు గురి అవుతాము
అలా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించినట్లైతే ఎంతో ధైర్యముగా ఉండగలం. ఈ వాక్యము వ్యర్థమైనదేదియు మన నోటితో పలుకకూడదని మన హృదయాలోచనలు కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి అని మనకు తెలియజేస్తుంది.
కనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉందాం
దేవుడు ఈ వాక్యానుసారముగా జీవించే కృపను మనకు తోడుగా ఉంచును గాక. ఆమెన్
No comments:
Post a Comment