యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే
సామెతలు 8:13
ప్రియులారా దేవుని జ్ఞానం కలిగిన సొలొమోను ద్వారా దేవుడు ఈ మాటను మనకు సెలవిస్తునాడు.
ఈ లోకం లో ఆయనకీ ఇష్టమైన ప్రజలముగా ఎలా జీవించగలమో ఆయన మనకి తెలియ జేయుచున్నాడు దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపని ద్వేషించాడు అలాగే దేవునియందు భయభక్తులుగలవారమై మనం ఉండగోరిన యెడల మనం కూడా చెడు తనమును అసహ్యించుకొనువారమై ఉండాలి
పోతీఫర్ భార్య యోసేపును పాపము చేయుటకు ప్రేరేపించినపుడు యోసేపు ఆమెతో నేనెట్లు ఇంత గోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదునని అన్నాడు.
ఈ మాటను బట్టి యోసేపు దేవుని పట్ల ఎంత భయం గలవాడో మనకు అర్థం అవుతుంది.
ప్రియులారా ఈ లోకంలో మనకి కూడా అనేక సార్లు చెడు తనం గుండా వెళ్ళుటకు ప్రేరేపణలు కలుగుతాయి. అటువంటి పరిస్థితులలో సాతానుకు మనం లొంగకుండా మన సహాయకుడైన యేసయ్య నడిపింపుకై ఎదురుచూడాలి. దేవుని దృష్టికి నీతిమంతులమవాలంటే ఎటువంటి పరిస్థుతలలోను మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించరాదు.
ఈ వాక్యం మనలను చెడుతనము నుండి తొలగిపోయి దేవుని యందు భయభక్తులు గలవారమై ఉండాలని తెలియజేస్తుంది. గనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుదాం.
దేవుడు మనలను నీతిమంతునిగా మార్చును గాక. ఆమెన్.
No comments:
Post a Comment