మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును.
యిర్మియా 6: 16
ప్రియులారా
నెమ్మదిగా లేకుండా విస్తారమైన ధనము సంపాదించడం వలన మనకు ఏమి ప్రయోజనం ఉండదు మనము మన ఇష్టానుసారముగా జీవించడం వలన కూడా మనకు ఎటువంటి మేలు జరుగదు
అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును నేను జ్ఞానిని గదా అని అనుకొనవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అని
ప్రియులారా చెడు మార్గము మనలను నిత్య నరకానికి తీసుకొని వెళుతుంది మంచి మార్గము మనలను నిత్యజీవానికి తుసుకొని వెళుతుంది దేవుని వాక్యం మనలను మంచి మార్గములో నడిపిస్తుంది గనుక మనము చేసే ప్రతి పని దేవుని వాక్యానుసారమేనా కాదా అని పరిశీలించి చేయు వారమై యున్నాము
అప్పుడే మనము నెమ్మది గలవారమై జీవిస్తాము
ఈ వాక్యము దేవుని మార్గములో మనము నడవాలని గుర్తు చేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని నెమ్మది గల వారమై జీవిద్దాం
దేవుడే మనలను తన మార్గములో నడిపించును గాక
ఆమేన్
No comments:
Post a Comment