నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
కీర్తనలు 119: 11
ప్రియులారా నరుల చెడుతనము బాల్యం నుండే చెడ్డదని దేవుడు సెలవిచ్చాడు
మన హృదయంలో ఏ ఆలోచనలు ఉంటాయో అలాగే మనము జీవిస్తుంటాము
మన హృదయము పాపముతో ఉన్నట్లయితే మనము పాపులము గానే జీవిస్తాము పాపముతో మనం పరలోకానికి వెళ్ళలేము దేవుని వాక్యం ఈ లోకానికి వెలుగై యుంది ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో మన హృదయంలో పాపమనే చీకటి వెళ్ళిపోయి పరిశుద్ధత అనే వెలుగు వస్తుంది అప్పుడు ఈ లోకంలో మనం పరిశుద్ధులముగా జీవించగలము
దావీదు భక్తునికి దేవుని యొక్క వాక్యపు విలువ తెలుసు కాబట్టి ఈ మాటలు పలుకుతున్నాడు
మనం ఈ లోకంలో పరిశుద్ధముగాను నీతిగాను బ్రతకాలంటే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి అందుకే ప్రతిదినం దేవుని వాక్యాన్ని వింటూ
ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకుందాం
ఈ వాక్యము మనం పాపము చేయకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని తెలియజేస్తుంది గనుక
ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి పరిశుద్ధులముగా జీవితం దేవుని వాక్యం మన హృదయంలో ఉండి మనలను పరిశుద్ధలనుగా చేయును గాక ఆమెన్
No comments:
Post a Comment