నేను నిన్ను విమోచించియున్నాను, బయపడకుము పేరు పెట్టి నిన్ను పిలచియున్నను నీవు నా సొత్తు
యెషయా 43:1
ప్రియులారా దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు అందుకే పాపం లో ఉన్న మన కొరకు తన కుమారుడైన యేసయ్యను లోకానికి పంపించాడు. యేసయ్య సిలువ లో మరణించి తన రక్తం ద్వారా మన పాపపు బంధకాలనుండి మనకు విమోచన కలుగజేశాడు
ఇక మనం ఈ లోకం లో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలోఎంతో మంది గొప్ప వారు ఉన్నపటికీ మనలనే ఆయన ముందుగా పిలుచుకున్నాడు ఆయన సొత్తుగా మనలని చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు అయినా ప్రజలం గనుక మనలను ముట్టువాడు దేవుని కనుగుడ్డును ముట్టినవారితో సమానంగా ఎంచబడును
ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకిచ్చాడని మనం గ్రహించి దేవునికి ఇష్టమైనా పనులను చేసేవారమై ఉండాలి. దేవుడు పరిశుద్దుడు గనుక ఈ లోకం లో మనం కూడా పరిశుద్ధముగా జీవించాలి. అప్పుడే ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటుంది.
మనం దేవున్ని విసర్జించి పాపన్ని ఆశించినట్లైతే
దేవుని గొప్ప కాపుదలకి మనం దూరం అవుతాము.
గనుక మన పాపాన్ని బట్టి దేవుడు మనలని విసర్జించకముందే మనం మన పాపాన్ని విసర్జించి దేవుని సొత్తుగా జీవిదాం .
ఈ వాక్యం దేవుడే మనకు తోడై ఉన్నాడని ఆయన మన పాపాన్ని తిసివేసి ఆయన సొత్తుగా చేసుకున్నాడని గుర్తుచేస్తుంది.
గనుక ఈరోజంత ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సొత్తయిన ప్రజలముగా ఆయన కాపుదల గలవారమై జీవిదాం.
దేవుని సహవాసము మనకి తోడుగా ఉండి మనలను దీవించునుగాక ఆమెన్.
No comments:
Post a Comment