Breaking

Thursday, 27 August 2020

Daily bible verse in telugu

 


తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి.

యోహాను 15: 9

ప్రియులారా

యేసయ్య ఈ లోకానికి నరరూపిగా వచ్చి ఎన్ని అద్భుత కార్యాలను చేసాడు ఆయన మాత్రమే ఈ లోకములో పరిశుద్ధముగా జీవించినవాడు 

ఈ పాపపు లోకములో ఏ పాపము లేకుండా చరిత్రలో నిలిచాడు 

పరిశుద్ధముగా ఎలా జీవించాలో మనకు మాదిరి చూపించాడు ఇదంతా తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు గనుకనే చేయగలిగాడు 

ఈ లోకములో యేసయ్య జీవించినంత కాలం 

తండ్రి చిత్తాన్నే నెరవేర్చాడు పరలోకపు తండ్రి యేసయ్యను ఎంతగానో ప్రేమించాడు గనుకనే అన్ని విషయాలలో యేసయ్యకు తోడుగా ఉన్నాడు 

అలాగే యేసయ్య కూడా ఇప్పుడు మనకు తోడుగా ఉన్నాడు మనము ఆయన మాటను విని దాని ప్రకారంగా జీవించినట్లైతే మనము కూడా యేసయ్యలా 

ఏ పాపము లేకుండా జీవించగలము దేవుడు మన నుండి కోరుకునేది అదే కోడి తన పిల్లలను కాపాడినట్లుగా యేసయ్య మనలను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు 

మనము ఆయన ప్రేమను గ్రహించి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే ఆయన మనలను బట్టి ఎంతో సంతోషిస్తాడు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అని యేసయ్య చెబుతున్నాడు 

మనము ఆయనను ప్రేమించడమంటే ఆయన మాటల ప్రకారం జీవించడమే 

ఈ వాక్యము యేసయ్య మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలని తెలియజేస్తుంది 

గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ 

దేవుని ప్రేమలో నిలిచి ఉందాం 

దేవుని ప్రేమ మనకు తోడుగా ఉండి మనలను బలపరచును గాక ఆమెన్ 


No comments:

Post a Comment