అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
కీర్తనలు 145: 2
ప్రియులారా దావీదు భక్తుడు దేవునితో ఒక గొప్ప నిబంధనను చేసుకున్నాడు అనుదినము ఆయనను స్తుతించెదనని ఆయన సంతోషముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు దుఃఖములో ఉన్నను బాధలో ఉన్నను
బలహీనతలో ఉన్నను అతని స్థితి ఏదైనను
దేవుని స్తుతిస్తాను అని చెబుతున్నాడు
అవును ప్రియులారా మనము విషయమునందును దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మన విషయములో దేవుని చిత్తమని వాక్యం బోధిస్తుంది కనుక దావీదు వలె
మనము కూడా ప్రతీ దినము ఆయన స్తుతించేవారమై యుండాలి
దేవుణ్ణి స్తుతించడం వలన ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి ఒకనాడు సువార్తను ప్రకటించినందుకు
పౌలు సీలను యూదులను కొట్టి చెరసాలలో వేయించారు అయితే అర్ధరాత్రి వేలా వాళ్లు దేవుణ్ణి
పాటలు పాడుతూ స్తుతించసాగిరి వెంటనే మహా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి
వారి బంధకాలన్నీ ఊడిపోయెను మనం కూడా మన పరిస్థితి ఏదైనా సరే దేవుని స్తుతించినట్లైతే దేవుడు మనకు కలిగిన బంధకాలన్నీటిని తొలగించి
మనలను స్వతంత్రులనుగా చేస్తుంది
ఈ వాక్యం మనము అనుదినము దేవుణ్ణి స్తుతించాలని మనకు తెలియజేస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యాన్ని స్తుతించి మనకున్న బంధకాలన్నింటి నుండి
విడుదల పొందుకుందాం
దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదించును గాక ఆమేన్
No comments:
Post a Comment