నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
కీర్తనలు 91: 11
ప్రియులారా ఈ వాక్యాన్ని మోషే, దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రార్ధిస్తూ రాసియున్నాడు ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కాపాడిన విధమును ఆయన ఈ మాటలను వ్రాసాడు
తన ప్రజలకు ముందుగా తన దూతలను పంపి వారు వెళ్ళు మార్గములో వారిని కాపాడాడు
ఏ అపాయము కలుగకుండా ఏదియు కూడా వారికి కొదువ లేకుండా దేవుడు వారిని పోషించాడు
ప్రియులారా మనలను కాపాడుటకు కూడా మన కన్నా ముందుగా తన దూతలను పంపాడు తన దూతల కాపుదల వలననే మనమింకను సజీవులముగా ఉన్నాము ఈ దూతలు మనలను కాపాడుటకును
మన ప్రార్ధనలను దేవుని యొద్దకు తీసుకుళ్ళుటకును మన కోసం నియమింపబడ్డాయి
ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము నమ్ముతామో
అప్పుడు దీనిలోని ఆశీర్వాదాన్ని పొందుకోగలము
ఈ వాక్యము మనకు దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉందని అలాగే మనలను కాపాడుటకు తన దూతలను దేవుడు నియమించాడనే ధైర్యాన్ని మనకిస్తుంది
గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించి ఆయన కాపుదలను పొందుకుందాం
దేవుని తోడు మనకు ఎల్లపుడు ఉండి మనలను ఆశీర్వదించును గాక ఆమెన్
No comments:
Post a Comment