ఇశ్రాయేలు ప్రజలు 430 సం||లు ఐగుప్తుదేశంలో బానిసలుగా వున్నారు. ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారు. వారి మొర ఆలకించిన దేవుడు మోషేను పంపాడు. మోషే ఫరో రాజు అనుమతితో ఇశ్రాయేలు ప్రజలందరిని కనాను దేశానికి బయలుదేరదీశాడు. ఇశ్రాయేలు ప్రజలు అబీబను నెల 15వ దినము ఐగుప్తు నుండి బయలుదేరారు. వారి వెంట వారి పిల్లలు, సేవకులతో పాటు పశువులు, పక్షులు కూడ వున్నాయి. వారు ఎర్ర సముద్రము దిశగా ప్రయాణం చేశారు. యెహోవా దేవుడు పగలు మేఘసంభంలోను, రాత్రులందు అగ్ని స్తంభంలోను వుండి వారికి ముందుగా నడుస్తూ మార్గం చూపించాడు.
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటుట :
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి బయలుదేరారు. వారు వెళ్ళిపోయినందున ఐగుపు దేశంలో పనులన్నీ ఆగిపోయాయి. అందువల్ల ఫరో చక్రవర్తి, అదికారులందర్ని సమావేశపరచాడు. ఇశ్రాయేలు ప్రజలను వెనక్కు తీసికొని రమ్మని ఆజ్ఞాపించాడు. ఒక పెద్ద సైన్యము రథాలపై, గుర్రాలపై బయలుదేరింది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారికి ముందు ఎర్రసముద్రము, వెనుక ఫరో సైన్యము వున్నాయి. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా వుంది. ఇశ్రాయేలు ప్రజల్లో కలవరం రేగింది. వాళ్లు మోషే దగ్గరికి వచ్చి యిలా సణగ సాగారు. “ఐగుప్తు దేశంలో సమాధులు లేవని, మమ్మల్ని ఈ అరణ్యంలో చంపాలని తెచ్చావా? మేము ఐగుప్తులో దాసులుగానే వుంటాము.
అక్కడే పనిపాటలు చేసికొంటూ సుఖంగా కాలం గడుపుతాము.” అప్పుడు మోషే వారితో "భయపడకండి, రేపు యెహోవా మీకు చేయబోయే మేలును ఊరక నిలుచుండి చూడండి. యెహోవాయే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఐగుప్తు సైన్యాన్ని యికపై ఎన్నడూ చూడరు. మీరంతా ధైర్యంగా ముందుకు సాగిపొండి" అని చెప్పాడు. యెహోవా ఆనతి యివ్వగా మోషే తన చేతికర్రను ముందుకు చాచాడు. ఎర్ర సముద్రం రెండు పాయలుగా చిలిపోయింది. నీళ్ళు రెండు వైపులా గోడలా నిలిచాయి. ఇశ్రాయేలు ప్రజలందరు ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. దేవుడు వారికి, ఐగుప్తు సైన్యానికి మధ్య అగ్నిస్తంభమై నిలిచాడు. అందువల్ల ఐగుప్తు సైన్యం వారిని సమీపించలేకపోయింది. మరునాడు ఐగుప్తు సైన్యము ఎర్రసముద్రం మధ్యలో వున్నప్పుడు మోషే తన కర్రను చాచాడు. ఐగుప్తు సైనికులందరు సముద్రంలో మునిగిపోయారు. ఈ ఆద్భుత కార్యాన్ని చూసిన ఇశ్రాయేలీయులు, యెహోవాయందు, మోషే యందు పూర్తి నమ్మకంవుంచారు. సంతోషంతో దేవుణ్ణి యిలా స్తుతించారు.
యెహోవాయే నా బలము, నా గానము. ఆయన నాకు రక్షణయు ఆయెను. (నిర్గమ 15వ అ.)

ఇశ్రాయేలు ప్రజలు 'మారా' అనే ప్రదేశంలో బస చేశారు. ఆ ప్రదేశంలో నీళ్లు చేదుగా వున్నాయి. తాగడానికి నీళ్లు లేవని ప్రజలంతా సణుగుతున్నారు.
అప్పుడు మోషే దేవుని ప్రార్థించాడు. దేవుడు చూపించిన ఒక చెట్టును నీళ్ళలో వేశాడు. వెంటనే ఆ నీళ్ళు మధురంగా మారిపోయాయి.

దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించుట :
రెండు నెలలు గడిచాయి. ఇశ్రాయేలీయుల “సీను” అనే అరణ్యానికి చేరాడు. వాళ్లు తినడానికి మంచి భోజనం, మాంసము లేవని సణుగుడు ప్రారంభించారు. అప్పుడు యెహోవా దేవుడు తాను చేయబోయే అద్భుత కార్యం మోషేకు తెలియజేశాడు. మోషే ప్రజలందరిని శాంత పరిచాడు.
“యెహోవా మకోసం ఈ సాయంత్రం మాంసాన్ని, రేపు ఉదయం ఆహారాన్ని
ఆకాశం నుండి కురిపిస్తాడు. రేపు ఉదయం మీరు దేవుని మహిమను చూస్తారు” అన్నాడు. ఆ సాయంత్రం యెహోవా ఆకాశం నుండి పూరేళ్ళను (పక్షులను) పంపాడు. మరునాడు ఉదయాన్నే వారి పాళెము చుట్టూ మంచు కనిపించింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె వుంది. దాని రుచి తేనెతో కలసిన అరూపము వలె ఉంది. ప్రజలందరు అమితాశ్చర్యంతో దానికి "మన్నా" (ఇదేమి) అని
పేరు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణించిన 40 సం॥లు కాలము, ప్రతిరోజు, ఈ మన్నానే భుజించారు. ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యం దాటి రెఫీదీములో దిగారు. వారు తాగడానికి నీళ్లు లేనందున మోషేతో వాదింపసాగారు. “మమ్మల్ని, మా పిల్లల్ని యిక్కడ చంపడానికి తెచ్చావా?" అని సణిగారు. మోషే ప్రజల కష్టాన్ని యెహోవాకు విన్నవించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు పెద్దలను పిలుచుకొని “హారేబు" అనే చోటికి వెళ్ళాడు. అక్కడ మోషే ఒక బండను కొట్టగా దానిలో నుండి నీళ్ళు ప్రవహించాయి. ప్రజలందరు ఆ నీళ్ళు త్రాగి తృప్తి చెందారు. ప్రజలు వాదించి, దేవుణ్ణి శోధించారు కాబట్టి ఆ స్థలానికి 'మస్సా' అని మెరీబా' అని పేర్లు వచ్చాయి.

అమాలేకీయులతో యుద్ధము :
రెఫీదీములో అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. మోషే యెహోషువకు కొంత సైన్యాన్ని యిచ్చి పంపాడు. తన వెంబడి ఆహారోను, పూరు అనే యిద్దరిని పిలుచుకొని కొండ శిఖరం ఎక్కాడు. మోషే
తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు సైనికులు గెలిచేవారు. మోషే చెయ్యి దించినప్పుడు ఓడిపోయేవారు. మోషే చేతులు బరువెక్కాయి. చేతులు ఎత్తి వుంచలేక పోతున్నాడు. అందువలన మోషేను ఒక రాతిమీద కూర్చోబెట్టి ఆహరోను, హూరులు ఆయన చేతులను సూర్యుడు అస్తమించే వరకు ఎత్తిపట్టు కొన్నారు. అమాలేకీయులు పూర్తిగా ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు విజయోత్సాహంతో కేకలు వేశారు. మోషే ఆ చోటుకు "యెహోవా నిస్సీ" (యెహోవా ధ్వజము) అని పేరు పెట్టాడు.
మోషే మామ పేరు యిత్రో, అతడు మోషేభార్య అయిన సిప్పోరాను, యిద్దరు కుమారులను తీసికొని మోషే దగ్గరికి వచ్చాడు. “యెహోవా సమస్త
దేవతలకంటె గొప్పవాడు అనే విషయం యిప్పుడు తెలసికొన్నాను" అన్నాడు. యిత్రో సలహా ప్రకారం మోషే వెయ్యి, నూరు, యాభై, పది మందికి ఒకరు
చొప్పున న్యాయాధిపతులను నియమించాడు.

సీనాయి కొండ : పది ఆజ్ఞలు : ధర్మశాస్త్రము :-
ఇశ్రాయేలు ప్రజలు మూడవ నెల పదవ రోజు సినాయి పర్వతానికి వచ్చారు. యెహోవా మోషేను సీనాయి కొండపైకి రమ్మన్నాడు. ప్రజలు దేవుని యెడల భయభకులతో, నీతిగా జీవించడానికి అవసరమైన 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని భోదించాడు. దేవుడు తన చేతితో రెండు రాతి పలకల పై ఈ పది ఆజ్ఞలను వ్రాశాడు.
1) నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక
దేవుడు మీకు వుండకూడదు.
దేవుడు మీకు వుండకూడదు.
2) విగ్రహారాధన చేయకూడదు
3) నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
4) విశ్రాంతి దినమును అనగా ఏడవదినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను.
5) నీ తల్లిని తండ్రిని
సన్మానింపుము.
సన్మానింపుము.
6) నరహత్య చేయకూడదు
7) వ్యభిచరింపకూడదు
8) దొంగిలకూడదు
9) నీ పొరుగువాని మీద అబద్ద సాక్ష్యము పలుకకూడదు
10) నీ పొరుగువాని యిల్లును, భార్యను, దాసుని, జంతువును, దేనిని ఆశింపకూడదు.
యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాటించవలసిన సామాజిక, వ్యక్తిగత, కుటుంబనియమాలను, దేవుని ఆరాధించవలసిన విధివిధానాలను మోషేకు తెలిపాడు. మోషే వాటిని ప్రజలకు వినిపించాడు ఆ నియమాలకు “మోషే ధర్మశాస్త్రము"అని పేరు. ధర్మశాస్త్రంలో పూజలు, బలులు, సంఘనియమాలు, శిక్షలు మొ|| చాలా విషయాలను గురించి వ్రాయబడి వుంది. యూదులు ఇప్పటికీ మోషే ధర్మశాస్త్రాన్నే అనుసరిస్తూ వున్నారు.
ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను పూజించుట :
మోషే ఇశ్రాయేలు ప్రజలను మైదానంలో వదిలి పెట్టి ఒంటరిగా సినాయి. పర్వతం పైకి వెళ్లాడు. ఆయన సీనాయి పర్వతంపై చాలా రోజులు వున్నాడు.
నాయకుడు లేని కారణంగా ప్రజల్లో ఓర్పు నశించింది. విభేదాలు, తగవులు ఎక్కువయ్యాయి. వారు అహరోను దగ్గరికి వచ్చి, "మోషే ఎక్కడికి వెళ్లాడో,
ఏమయ్యాడో మాకు తెలియదు. మాకు దారి చూపించడానికి ఒక దేవతను తయారు చెయ్యి" అని విసిగించారు. అప్పుడు అహరోను స్త్రీల, పిల్లల చెవి
పోగులన్నీ తెప్పించి, వాటిని కరిగించి ఒక బంగారు దూడను తయారు చేయించాడు. ప్రజలు ఆ దూడను తమ దేవునిగా, రక్షకునిగా భావించారు. మనలను ఇగుప్తు నుండి బయటికి రహ్మించిన దేవుడు యితడే అని కేకలు వేయసాగారు. ఆ దూడకు పూజలు చేసి దహన బలులు అర్పింపసాగారు. ఈ సంగతి తెలిసిన యెహోవా దేవుడు చాలా కోసపడ్డాడు. అయితే మోషే
దేవుణ్ణి బ్రతిమిలాడాడు. "నీవు ఆశీర్వదించి, ఐగుప్తు నుండి రప్పించిన ప్రజలను యిక్కడ చంపితే అన్యులు అపహాస్యం చేస్తారు" అన్నాడు. మోషే కొండ దిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ బంగారు
దూడను పొగడుతూ, నాట్య చేయడం చూశారు. ఆయనకు చాల కోపం వచ్చింది. తన చేతిలోని రాతి పలకలను విసిరికొట్టాడు. తర్వాత ఆ దూడను.
అగ్నితో కరిగించి, బూడిద చేసి, దానిని నీళ్లలో కలిపి ప్రజలందరికి త్రాగించాడు మోషే యెహోవాతో "నీ మహిమను నాకు చూపించు" అన్నాడు అందుకు యెహోవా, నీవు నా ముఖమును నేరుగా చూడలేవు. ఒక బండ చాటునుండి చూడమని చెప్పాడు. మోషే ఒక బండ సందులో నుండి దేవుని మహిమను చూశాడు. ఆయన వెనుక పార్శ్యమును మాత్రమే చూశాడు. తర్వాత మోషే రెండవసారి సీనాయి పర్వతం ఎక్కి 40 రోజులు యెహోవా సన్నిధిలో
గడిపాడు. ఆయన మరల వ్రాసి ఇచ్చిన పది ఆజ్ఞలను, కట్టడలను ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. వారితో ఆచరింపచేశాడు మోషే చేయించిన ఇత్తడి సర్పము ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండవద్ద బస చేశారు. అక్కడ అహరోను మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలు హోరు నుండి సాగిపోతూ దేవునికి, మోషేకు వ్యతిరేకంగా సణగసాగారు. "యిక్కడ మాకు మంచి ఆహారం లేదు. మంచి నీళ్ళు లేవు. చవి సారము లేని ఈ ఆహారం అంటే మాకు అసహ్యం వేస్తుంది". అని గొణుగుతున్నారు. దేవునికి కోపం వచ్చి తాపకరమైన సర్పములను (పాములను) పంపించాడు. అవి కరచిన వారందరు చనిపోతున్నారు. ప్రజలు
భయకంపితులయ్యారు. తమ అనుచిత ప్రవర్తనకు పశ్చాత్తాపపడ్డారు. పాముల బారినుండి రక్షించమని మోషేను బ్రతిమలాడారు. మోషే యెహోవాను
ప్రార్థించాడు. ఆయన ఆజ్ఞ మేరకు ఒక యిత్తడి సర్పము చేయించి స్తంభము మీద పెట్టాడు. సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పము నిదానించి చూసిన తర్వాత బ్రతికాడు. చూడనివాడు చనిపోయాడు

ఇశ్రాయేలు ప్రజలు శతృరాజులను ఓడిస్తూ, వారి పట్టణాలు ఆక్రమించుకొంటూ, ముందుకు సాగిపోయారు. తమను ఎదిరించిన అమోరీయుల రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును ఓడించారు. వారి పట్టణాలను, పల్లెలను దోచుకొన్నారు. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల ప్రయాణాన్ని 40 సం||లు చేశారు. అందుకు వారి అవిధేయత, చెడు ప్రవర్తనలే కారణము, యెహోవా మోషేకు కనాను దేశాన్ని చూపించాడు. అయితే, నివు
ఆక్కడికి వెళ్లకూడదు. అని చెప్పాడు. మోషే 120సం॥ల వయస్సులో మరణించాడు. మోషే వంటి గొప్ప ప్రవక్త, నాయకుడు, నమ్మకమైన సేవకుడు
ఇశ్రాయేలీయులలో యింత వరకు పుట్టలేదు

ధ్యానాంశములు :
1.మోషే చాలా నమ్మకమైన సేవకుడు. పట్టుదల కలిగిన నాయకుడు. మొదట సందేహించాడు కాని తర్వాత దేవుని ఆజ్ఞకు విధేయుడై ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు. కనాను దేశానికి నడిపించాడు.
2.ప్రజలు చాలా సార్లు సణిగారు. విసుక్కొన్నారు. అయినా ఓర్పుతో వారిని నడిపించాడు. వారి కష్టాలను దేవునికి విన్నవించి, తొలగింప చేశాడు.
3.మోషే దేవుని యందుభయభక్తులు గలవాడు
4.మోషేకు, యేసుక్రీస్తుకు పోలికలు వున్నవని బైబిలు పండితులు భావిస్తున్నారు. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడిపించాడు.
యేసుక్రీస్తు మానవ జాతిని పాప దాస్యం నుండి విడిపించాడు

5.కనాను దేశం పరదైసుకు, ఐగుప్తు దేశం ఈ లోకానికి సూచనగా వున్నది
6.ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసులకు సూచనగా వున్నారు ఆజ్ఞలు పాతనిబంధన గ్రంథములో అతి ప్రాముఖ్యమైనవి
బంగారు వాక్యము :
నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమ 20:1
No comments:
Post a Comment